Home /News /movies /

ALLARI NARESH TOOK A SENSATIONAL DECISION AND SAYS NO TO COMEDY MOVIES FROM NOW ON WARDS PK

Allari Naresh: అల్లరి నరేష్ నిర్ణయంతో దర్శకులు షాక్.. కామెడీ వద్దంటున్న అల్లరోడు..

అల్లరి నరేష్ (Allari Naresh)

అల్లరి నరేష్ (Allari Naresh)

Allari Naresh: తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది అల్లరి నరేష్ ఒక్కడే. తొలి సినిమా అల్లరి నుంచి నిన్నమొన్నటి సిల్లీఫెల్లోస్ వరకు ఎన్నో సినిమాల్లో కామెడీ చేసాడు నరేష్.

తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది అల్లరి నరేష్ ఒక్కడే. తొలి సినిమా అల్లరి నుంచి నిన్నమొన్నటి సిల్లీఫెల్లోస్ వరకు ఎన్నో సినిమాల్లో కామెడీ చేసాడు నరేష్. కానీ వరసగా అలాంటి సినిమాలు చేస్తే ఎవరికైనా తెలియని విసుగు వచ్చేస్తుంది. నరేష్ విషయంలో కూడా ప్రేక్షకులకు వచ్చేసింది. అందుకే ఈయన కామెడీ సినిమాలు చేసినా కూడా పట్టించుకోవడం లేదు ఆడియన్స్. ఈ విషయం తెలుసుకోడానికి నరేష్‌కు కూడా కాస్త టైమ్ పట్టింది. అందుకే కొన్నేళ్లుగా ఈయన సినిమల సంఖ్య పూర్తిగా తగ్గించేసాడు. ఒకప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు కూడా చేసిన నరేష్.. ఇప్పుడు రెండేళ్లవుతున్నా హీరోగా సినిమా చేయలేదు. దానికి కారణం కామెడీ కంటే కంటెంట్ ముఖ్యం అని ఇప్పుడు నమ్ముతున్నాడు ఈయన. తాజాగా నరేష్ నటిస్తున్న నాంది సినిమా గురించి ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో న్యాయం కోసం ప్రాణం కూడా లెక్కచేయని యువకుడిగా నటిస్తున్నాడు నరేష్.

పైగా నటుడిగా నరేష్‌కు మంచి పేరుంది. ఈయన కామెడీ సినిమాలు చేసినప్పటి కంటే కూడా ప్రాణం, నేను, గమ్యం, శంభో శివ శంబో, మహర్షి లాంటి సినిమాలు చేసినపుడు వచ్చిన అప్లాజ్ ఎక్కువ. నటుడిగా ఈయన స్థాయేంటో చూపించిన సినిమాలు అవి. అందుకే తన దారేంటో ఇప్పుడు తెలుసుకున్నాడు నరేష్. అందుకే ఇంకపై కామెడీలు వద్దు బ్రదర్ అంటున్నాడు. తనకోసం తనపై నమ్మకంపై దర్శకులు కంటెంట్ ఉన్న కథలు తీసుకొస్తే చేయడానికి సిద్ధమే అంటున్నాడు అల్లరోడు.
allari naresh,allari naresh twitter,allari naresh says no comedy movies,allari naresh naandhi movie teaser,allari naresh naandhi movie breathe,allari naresh naandhi movie trailer,allari naresh naandi movie teaser,telugu cinema,అల్లరి నరేష్,అల్లరి నరేష్ నాంది,అల్లరి నరేష్ నాంది ఫస్ట్ లుక్,కామెడీ సినిమాలు చేయనంటున్న అల్లరి నరేష్
అల్లరి నరేష్ (Allari Naresh)

అందుకే ఇప్పటి నుంచి ఎన్ని సినిమాలు చేస్తున్నామని కాదు ఎలాంటి సినిమాలు చేస్తున్నామనేది దృష్టిలో పెట్టుకుంటానని చెప్పుకొచ్చాడు అల్లరి నరేష్. ఈయన తీసుకున్న నిర్ణయంతో చాలా మంది కామెడీ కథలు సిద్ధం చేసుకుంటున్న దర్శకులకు, రచయితలకు మాత్రం షాక్ తప్పకపోవచ్చు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allari naresh, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు