అల్లరి నరేష్ షాకింగ్ లుక్.. ఒంటిపై బట్టలు లేకుండా ‘నాంది’ ఫస్ట్ లుక్..

అల్లరి నరేష్.. ఎప్పుడు నవ్వితూ నవ్వించడమే కాదు.. అపుడపుడు ‘గమ్యం’, వంటి కొన్ని చిత్రాలతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. తాజాగా అల్లరి నరేష్.. ‘నాంది’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా..

news18-telugu
Updated: June 28, 2020, 10:03 AM IST
అల్లరి నరేష్ షాకింగ్ లుక్.. ఒంటిపై బట్టలు లేకుండా ‘నాంది’ ఫస్ట్ లుక్..
అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
  • Share this:
అల్లరి నరేష్.. ఎప్పుడు నవ్వితూ నవ్వించడమే కాదు.. అపుడపుడు ‘గమ్యం’, వంటి కొన్ని చిత్రాలతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. ‘సిల్లీ ఫెలోస్’ తర్వాత అల్లరి నరేష్ తాజాగా ‘నాందీ’ సినిమాతో పలకరించబోతున్నాడు.ఈ గ్యాప్‌లో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాలో ముఖ్యపాత్రలో అలరించాడు అల్లరోడు. తాజాగా అల్లరి నరేష్ ‘నాందీ’ సినిమాతో పలకరించబోతున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైయింది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో మిగతా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. హీరోగా అల్లరి నరేష్‌కు ఇది 57వ చిత్రం. తాజాగా ఈ సినిమాలో అల్లరి నరేష్.. బట్టలు లేకుండా.. పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సినిమాలో అల్లరి నరేస్ కమర్షియాలిటీకి దూరంగా నటించబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ నెల 30న అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ అంటే టీజర్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.


ఈ చితర్ంలో వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి, ప్రవీణ్,  ప్రియదర్శి, దేవీప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి సహజత్వానికి దగ్గర రా కంటెంట్‌తో వస్తోన్న అల్లరి నరేష్ ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: June 28, 2020, 10:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading