ALLARI NARESH RELEASE SARVAM SIDDHAM MOVIE POSTER HERE ARE THE DETAILS TA
Allari Naresh: అల్లరి నరేష్ చేతుల మీదుగా ‘సర్వం సిద్ధం’ టీజర్ విడుదల..
అల్లరి నరేష్ విడుదల చేసిన ‘సర్వం సిద్ధం’ టీజర్ విడుదల (Twitter/Photo)
సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీమతి శ్రీలత మేడం రాబిన్ దర్శకత్వంలో రూపొందించిన ‘సర్వం సిద్దం’ చిత్రం వెరైటీ కామెడీతో కూడిన అల్లరి సునామీని సృష్టిస్తుందని ప్రముఖ హీరో అల్లరి నరేష్ పేర్కొన్నారు. ఈ సినిమా టీజర్‌ను అల్లరి నరేష్ విడుదల చేసారు.
Allari Naresh - Sarvam Siddham Movie | సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానరుపై శ్రీమతి శ్రీలత మేడం రాబిన్ దర్శకత్వంలో రూపొందించిన ‘సర్వం సిద్దం’ చిత్రం వెరైటీ కామెడీతో కూడిన అల్లరి సునామీని సృష్టిస్తుందని ప్రముఖ హీరో అల్లరి నరేష్ పేర్కొన్నారు. ఆయన సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంథ) చిత్ర ప్రొమోషనల్ టీజర్‌ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో నటుడు చిత్రం శ్రీను, సినెటేరియా సీఈవో వెంకట్ బులెమోని, చిత్ర నిర్మాత శ్రీమతి శ్రీలత, దర్శకుడు రాబిన్ నాయుడు, ప్రధాన పాత్రధారి గోవింద్ రాజ్ నీరుడి, హెయిర్ క్రియేషన్స్ ప్రతినిధులు శ్రీమతి రజిని, వినాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ టీజర్ ఆద్యంతం రోమాటిక్ కామెడీతో కడుపుబ్బా నవ్వడం గ్యారంటీ అన్నారు. ఆద్యంతం కామెడీతో రూపొందించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. చిత్రం పోస్టర్ ను చూస్తుంటేనే, ఈ చిత్రం లో కామెడీ ఏ స్థాయిలో ఉండబోతుందో అర్థమవుతోందని, కామెడీని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆనందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోవైపు అల్లరి నరేష్ ఈ యేడాది ‘బంగారు బుల్లోడు’ ’నాంది’ సినిమాలతో పలకరించాడు. ఇందులో బంగారు బుల్లోడు సినిమా ప్రేక్షకులను నిరాశ పరిస్తే.. ‘నాంది’ సినిమాతో చాలా యేళ్ల తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. ఈ సినిమాలో అల్లరి నరేష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు ఈ సినిమాతో అవార్డు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.