అల్లరి నరేష్‌ సరికొత్త ప్రయోగాలకు ఇదే ‘నాంది’ అవుతుందా..?

Allari Naresh: అల్లరి నరేష్ అంటే ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే గుర్తొచ్చేది. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోకు మళ్లీ క్రేజ్ తీసుకొచ్చింది ఈయనే. చాలా వేగంగా తక్కువ సమయంలోనే 50 సినిమాలు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 28, 2020, 7:52 PM IST
అల్లరి నరేష్‌ సరికొత్త ప్రయోగాలకు ఇదే ‘నాంది’ అవుతుందా..?
అల్లరి నరేష్ (Allari Naresh)
  • Share this:
అల్లరి నరేష్ అంటే ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే గుర్తొచ్చేది. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోకు మళ్లీ క్రేజ్ తీసుకొచ్చింది ఈయనే. చాలా వేగంగా తక్కువ సమయంలోనే 50 సినిమాలు కూడా పూర్తి చేసాడు నరేష్. అప్పట్లో వరస విజయాలతో దుమ్ము దులిపేసాడు కూడా. అయితే కొన్నేళ్లుగా అల్లరోడి సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. అంతగా నిరాశ పరుస్తున్నాయి ఈయన సినిమాలు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల కింద వచ్చిన సుడిగాడు సినిమానే అల్లరి నరేష్ చివరి బ్లాక్‌బస్టర్. మధ్యలో దాదాపు డజన్ సినిమాలు చేసినా విజయం మాత్రం పలకరించలేదు.
అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)


దాంతో ఇప్పుడు అల్లరి నరేష్ ఇప్పుడు సీరియస్ నరేష్ అవుతున్నాడు. తనను తాను మార్చుకుంటున్నాడు. నటుడిగా 50 సినిమాలు పూర్తి చేసిన తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాడు. ఇదివరకే గమ్యం, ప్రాణం, నేను లాంటి డిఫెరెంట్ సినిమాలు చేసాడు నరేష్. కానీ కామెడీ సినిమాలు హిట్ కావడంతో అలాంటి ముద్రే పడిపోయింది. గతేడాది మహర్షి సినిమా నుంచి మాత్రం తనను తాను మార్చుకుంటున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ఆ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా చాలా ఎమోషనల్ పాత్ర చేసాడు ఈ హీరో. ఇప్పుడు నాందీ సినిమాతో మరోసారి తనలోని కొత్తదనం చూపిస్తున్నాడు అల్లరి నరేష్.
అల్లరి నరేష్ నాందీ ఫస్ట్ లుక్ (allari naresh naandi)
అల్లరి నరేష్ నాందీ ఫస్ట్ లుక్ (allari naresh naandi)

ఈ సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇది అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటికే విడుదలైన 'నాంది' ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో పోస్టర్ కూడా అలాగే ఉంది. ఈ సారి కూడా నగ్నంగానే పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నాడు నరేష్. జూన్ 30న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కానుంది. అజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోడానికి నరేష్ నాంది లాంటి సినిమాను ఎంచుకుంటున్నాడు. దాంతో ఇకపై ఇలాంటి సినిమాలే చేస్తాడేమో చూడాలి.
First published: June 28, 2020, 7:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading