చిరంజీవి, వెంకటేశ్ అయిపోయారు...బాలయ్యపై పడ్డ అల్లరి నరేష్

నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు.

news18-telugu
Updated: December 11, 2018, 6:37 PM IST
చిరంజీవి, వెంకటేశ్ అయిపోయారు...బాలయ్యపై పడ్డ అల్లరి నరేష్
చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, అల్లరి నరేష్
  • Share this:
నిన్న మొన్నటి వరకు రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగులో మినిమం గ్యారంటీ హీరోగా అల్లరి నరేశ్‌కు మంచి పేరుండేది. కానీ ‘సుడిగాడు’ తర్వాత మనోడి సుడి ఏమాత్రం బాగాలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టే బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. జనాలకు కూడా అల్లరి నరేష్ కామెడీపై రాను రాను ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తోంది.

ప్రస్తుతం అల్లరినరేష్ హీరో వేషాలకే పరిమితం కాకుండా...మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు అల్లరి నరేష్.. ఇ.సత్తిబాబు, గిరి దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో కొత్త దర్శకుడు గిరి దర్శకత్వంలో తెరకెక్కతోన్న ఈ మూవీకి ఒకప్పటి బాలకృష్ణ సూపర్ హిట్ టైటిల్ ‘బంగారు బుల్లోడు’ పేరు అనుకుంటున్నారు.

గతంలో అల్లరి నరేష్..చిరంజీవి సూపర్ హిట్ ‘యముడికి మొగుడు’ టైటిల్‌తో ఒక సినిమా చేసాడు. మరోవైపు వెంకటేశ్ హిట్ మూవీ ‘సుందరకాండ’ టైటిల్‌తో ఇంకో మూవీ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఇద్దరు స్టార్ హీరోల టైటిల్స్‌తో చేసిన సినిమాలు అల్లరి నరేష్‌కు హిట్టు ఇవ్వలేకపోయాయి. ఒక్క రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన పాత సూపర్ హిట్ ‘అహనా పెళ్లంట’ టైటిల్‌తో చేసిన సినిమా మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. మొత్తానికి చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల టైటిల్స్‌తో హిట్టు అందుకోలేకపోయిన అల్లరి నరేష్...బాలయ్య సూపర్ హిట్ టైటిల్‌తో సక్సస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

First published: December 11, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు