అల్లరి నరేష్‌కు ఏమైంది.. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా వేలాడదీసి..

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ పాత్రలే కాకుండా అన్ని రకాల కారెక్టర్స్ చేసాడు ఈయన. అయితే అందులో కామెడీ ఎక్కువగా ఉండటంతో నరేష్ అంటే కేరాఫ్ కామెడీ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 20, 2020, 1:46 PM IST
అల్లరి నరేష్‌కు ఏమైంది.. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా వేలాడదీసి..
అల్లరి నరేష్ నాంది ఫస్ట్ లుక్ (allari naresh naandi)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ పాత్రలే కాకుండా అన్ని రకాల కారెక్టర్స్ చేసాడు ఈయన. అయితే అందులో కామెడీ ఎక్కువగా ఉండటంతో నరేష్ అంటే కేరాఫ్ కామెడీ అయిపోయాడు. అయితే ఈ మధ్య వరస పరాజయాలతో వెనకబడిపోయిన నరేష్.. ఇప్పుడు కొత్తదనం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇప్పట్నుంచి కొత్తగా ప్రయత్నిస్తానని చెప్పిన నరేష్.. ఎవరూ ఊహించని స్థాయిలో కొత్తదనం కోసం నాంది పలికాడు. ఈయన నటిస్తున్న కొత్త సినిమా నాంది. ఇప్పటి వరకు చేసిన కామెడీ చాలు అంటూ ఇప్పుడు పూర్తిగా సీరియస్ పాత్రలోకి మారిపోయాడు అల్లరోడు. ఈయన నటిస్తున్న 57వ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
మహర్షి సినిమాలో సీరియస్ పాత్రలో మెప్పించిన ఈయన.. ఇప్పుడు కొత్త దర్శకుడితో మరో ప్రయోగం చేస్తున్నాడు. దీనికి దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాత కావడం విశేషం. విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. పోలీస్ స్టేషన్‌లో తలకిందులుగా నగ్నంగా వేలాడదీసిన ఈ లుక్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అసలు ఈ స్థాయిలో కొత్తదనం కోసం నరేష్ ప్రయత్నించడం నిజంగానే మెచ్చుకోదగిన విశేషం. ఇది విజయం సాధిస్తే కచ్చితంగా నరేష్‌లోని మరో కోణం బయటికి వస్తుంది. ఇప్పటికే ప్రాణం, గమ్యం, విశాఖ ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు చేసాడు నరేష్. ఇప్పుడు మరోసారి కొత్తదనానికి నాంది పలుకుతున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: January 20, 2020, 1:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading