Allari Naresh - Nani: అల్లరి నరేష్‌కు తోటి హీరో నాని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే... అల్లరి నరేష్ చాలా యేళ్ల తర్వాత ‘నాంది’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినీ ఇండస్ట్రీ వాళ్లు కూడా నాంది సినిమాలో అల్లరి నరేష్ నటనను చూసి అభినందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా హిట్టైయిన సందర్భంగా అల్లరి నరేష్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసాడు.
‘నాంది’ సినిమాలో అల్లరి నరేష్ నటనను చూసి ఇకపై నువ్వు కామెడీ వేషాలు హీరో అంటే ఊరుకునేది లేదు. నాంది సినిమా చూసిన తర్వాత అల్లరి నరేషేనా ఈ సినిమాలో చేసింది అనే డౌటు నాకు వచ్చింది. ఇకపై పేరు మార్చేయ్.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఈ సినిమాతో నీలో ఓ మంచి నటుడిని చూశాను. చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరకుంటున్నాను అని నాని ట్వీట్ చేసాడు.
మొత్తానికి అల్లరి నరేష్‌ను ఉద్దేశిస్తూ నాని చేసిన ట్వీట్ బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాని హీరోగా ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు ‘అయితే సుందరానికి’ ‘శ్యామ్ సింగరాయ్’ వంటి సినిమాలను చేస్తున్నాడు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.