• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLARI NARESH NAANDHI MOVIE FIRST WEEK COLLECTIONS HOW MUCH MORE TO COLLECT TO BREAK EVEN TA

Allari Naresh Naandhi First Week Collections: అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టారంటే....

Allari Naresh Naandhi First Week Collections: అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మొత్తంగా ఎంత రాబట్టారంటే....

‘నాంది’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (Twitter/Photo)

Allari Naresh Naandhi First Week Collections: గత 9 ఏళ్లుగా సరైన సక్సెస్ లేని అల్లరి నరేష్ తాజాగా విడుదలైన ‘నాంది’ మూవీతో మరోసారి హీరోగా సత్తా చాటాడు. ఈ శుక్రవారంతో ఒక వారం పూర్తి చేసుకున్న ఈ సినిమా మొత్తంగా ఎంత రాబట్టిందంటే..

  • Share this:
    Allari Naresh Naandhi First Week Collections: గత 9 ఏళ్లుగా సరైన సక్సెస్ లేని అల్లరి నరేష్ తాజాగా విడుదలైన ‘నాంది’ మూవీతో మరోసారి హీరోగా సత్తా చాటాడు. ‘సుడిగాడు’ తర్వాత అల్లరి నరేష్ సుడి ఇన్నాళ్లుకు నాంది సినిమాతో మళ్లీ తిరిగింది.  డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో అల్లరి నరేష్ ఆకట్టుకున్నాడు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్‌కు ఈ సినిమా సక్సెస్ మంచి ఉత్సాహం అందించింది. ‘నాంది’ సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఎపుడు కామెడీ వేషాలతో కడుపుబ్బా నవ్వించే అల్లరి నరేష్ ఈ సినిమాలో సీరియస్ రోల్లో మెప్పించాడు. ఈ సినిమా కోసం పూర్తి నగ్నంగా నటించాడు కూడా. ఈ సినిమా కంటే ముందు నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

    కరోనా నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాట పట్టింది. మొత్తంగా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి ఈ సినిమా రూ. 3.47 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ రోజు ‘చెక్’  సహా పలు చిత్రాలు విడుదలయ్యాయి కాబట్టి.. నాంది సినిమాకు కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది.

    అల్లరి నరేష్ ‘నాంది’ (File/Photo)


    ఈ సినిమా నైజాం (తెలంగాణ)లో1.35  కోట్ల షేర్ రాబట్టింది. సీడెడ్ (రాయలసీమ) 0.44 కోట్లు రాబట్టింది. మిగిలిన ఏపీలో  ఈ చిత్రం రూ. 1.48 కోట్లను కొల్లగొట్టింది. ఇక రెస్టాఫ్ ఇండియా, ఓవర్సస్ కలిపి రూ. 20 లక్షల వరకు కలెక్షన్లు రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.47 కోట్లను రాబట్టి స్టడీగా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా చాలా ఏళ్ల తర్వాత అల్లరి నరేష్ .. ‘నాంది’ సినిమాతో తన విజయానికి నాంది పలికాడనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు