• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALLARI NARESH LATEST SUPER HIT NAANDHI MOVIE TO BE STREAMING AHA OTT FROM MARCH 12TH PK

Naandhi OTT date: అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా ఓటిటిలో విడుదలయ్యేది అప్పుడే..

Naandhi OTT date: అల్లరి నరేష్ ‘నాంది’ సినిమా ఓటిటిలో విడుదలయ్యేది అప్పుడే..

‘నాంది’ మూవీ (Twitter/Photo)

Naandhi OTT date: ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత ఓటిటిలో రావడం కూడా ముందుగానే నిర్ణయించుకుంటున్నారు నిర్మాతలు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినపుడే నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకుంటారు. కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత రెండు..

  • Share this:
ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన తర్వాత ఓటిటిలో రావడం కూడా ముందుగానే నిర్ణయించుకుంటున్నారు నిర్మాతలు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినపుడే నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకుంటారు. కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత రెండు వారాలకే ఓటిటిలో వచ్చేస్తున్నాయి. మరికొన్ని మాత్రం నెల రోజుల వరకు రావడం లేదు. ఇప్పుడు అల్లరి నరేష్‌ నాంది సినిమా కూడా మూడు వారాల తర్వాత ఓటిటిలో విడుదల కానుంది. ఈయనకు దాదాపు 8 ఏళ్ళ తర్వాత వచ్చిన విజయం నాంది. సుడిగాడు తర్వాత మధ్యలో దాదాపు 15 సినిమాలు చేసాడు నరేష్. అందులో ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇలాంటి సమయంలో కామెడీ కాదని.. సీరియస్ కథలకు నాంది పలుకుతూ వచ్చిన సినిమా నాంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇండియన్ పీనల్ కోడ్ లోని 211 సెక్షన్ గురించి నాంది సినిమా ఎక్కువగా చర్చించింది. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న విడుదలైంది. ఈ సినిమా మార్చ్ 12న ఆహా ప్లాట్ ఫామ్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నరేష్‌ను నాంది నరేష్ అని పిలుస్తున్నారు. అలాగే పేరు మార్చుకోవాలని నాని లాంటి హీరోలు కూడా సలహాలు ఇస్తున్నారు. విడుదలైన మూడు వారాల తర్వాత అగ్రిమెంట్ ప్రకారం సినిమాను ఆహాలో స్ట్రీమ్ చేయబోతున్నారు. సరిగ్గా 24 రోజుల తర్వాత ఓటిటిలో రానుందన్నమాట. సినిమాకు అద్భుతమైన టాక్ రావడం.. ప్రశంసలు దక్కడంతో కచ్చితంగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనూ వ్యూస్ బాగా వస్తాయని నమ్ముతున్నారు. 2.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన నాంది.. ఇప్పటికే 5 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను ఆహా మంచి రేటుకే సొంతం చేసుకున్నారు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించాడు.
Published by:Praveen Kumar Vadla
First published: