Geetha Singh: తెలుగు సినీనటి గీతా సింగ్. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న నటి. ఎక్కువగా హాస్య పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాలలో ఎక్కువగా సహాయ పాత్రలలోను మెప్పించింది. కితకితలు, ఎవడి గోల వాడిది సినిమాలలో కీలక పాత్రల్లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉంటే తన పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది గీత.
2009లో ఊహాచిత్రం అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయిన గీతాసింగ్ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. 2019లో తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమాలో చివరిగా నటించింది. ఇక మళ్ళీ ఎటువంటి అవకాశాలు కూడా అందుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరలో ఓ షోలో అడుగు పెట్టి తన కామెడీతో బాగా సందడి చేసింది.
ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రాం లో గెస్ట్ గా పాల్గొన్నది గీత. ఎంట్రీ తోనే సుమతో కలసి బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక సుమ.. గీతను ఏంటి ఈ మధ్య బాగా బాధ పడ్డారట అని ప్రశ్నించింది. వెంటనే స్పందించిన గీత.. తన బాడీ షేమింగ్ పై కొన్ని కామెంట్లు వస్తున్నాయని ఎమోషనల్ అయ్యింది. తనను పర్సనల్ విషయాలు కూడా అడుగుతున్నారని, ఇప్పటికీ ఎందుకు పెళ్ళి చేసుకోలేదని ప్రశ్నలు వేస్తున్నారని తెలిపింది.
కాని తాను సంతోషంగా ఉన్నాను అంటూ.. ఇంట్లో వాళ్లు హ్యాపీగా ఉన్నారని.. మధ్యలో మీకేంటి ప్రాబ్లమ్ అని.. కావాలని తనపై కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని తెలిపింది. అంతే కాకుండా బాగా ట్రోల్ చేస్తున్నారని.. బయట కూడా తనను చాలామంది ఈ విషయాలే అడుగుతున్నారని.. ఇవన్నీ తనకు చాలా బాధను ఉన్నాయని తెలిపింది. మేం తెరమీద కావాలి తప్ప.. మీకు మా పర్సనల్ విషయాలు అవసరం లేదని ఘాటుగా స్పందించింది. ఇక తను లావుగా ఉండటం వల్ల ప్రస్తుతం ఇండస్ట్రీలో పట్టించుకోవడం లేదని తెలిపింది. ఇక ఈ ఎపిసోడ్ లో గీత మాట్లాడిన మాటలు బాగా హైలెట్ గా నిలిచాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allari naresh, Anchor suma, Cash program, Geetha Singh, Kithakithalu