హోమ్ /వార్తలు /సినిమా /

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Allari Naresh Itlu Maredumilli Prajaneekam Twitter review Photo : Twitter

Allari Naresh Itlu Maredumilli Prajaneekam Twitter review Photo : Twitter

Allari Naresh : అల్లరి నరేష్ (Allari Naresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేాయాల్సిన పనిలేదు. తన సినిమాలతో, తనదైన యాక్టింగ్‌తో ఆయనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆ మధ్య సరైనా విజయాలు లేక సతమతమవుతున్నా నరేష్‌ నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam).. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కథేంటీ, కథనం ఎలా ఉంది.. తెలుగు వారిని సినిమా ఏమాత్రం ఆకట్టుకోనుంది.. వంటి అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అల్లరి నరేష్ (Allari Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో, తనదైన యాక్టింగ్‌తో ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆ మధ్య సరైనా విజయాలు లేక సతమతమవుతున్నా నరేష్‌కు గతేడాది నాంది సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ‘నాంది’ (Naandhi) చిత్రంలో నరేష్ మరోసారి తన నటనతో ఇరగదీశారు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఓవైపు కామెడీని పండేస్తూనే మరోవైపు సీరియస్ పాత్రల్లో నటిస్తూ అదరగొడుతుంటారు. గమ్యం(Gamyam)లో ఆయన నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. ప్రాణం సినిమాలో కూడా నరేష్ అదరగొట్టారు. ఇక నాంది విషయానికి వస్తే.. చేయని హత్య వల్ల శిక్ష అనుభవిస్తోన్న నరేష్ ఎలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దానికి కారణం ఎవరు అనేది ఈ సినిమా కథ. తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilli Prajaneekam), తాజాగా ఈ సినిమాకు సంబంధింంచిన ట్రైలర్ విడుదల చేశారు. నటుడిగా నరేష్ 59వ సినిమా. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఇది.

హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మరోవైపు ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అవేంటో చూద్దాం..

ఇందులో మారుమూల ప్రాంతమైన మారేడిమిల్లిలో (Itlu Maredumilli Prajaneekam) ఎలక్షన్ నిర్వహించే పోలింగ్ అధికారి పాత్రలో అల్లరి నరేష్  నటించారు. ఈ చిత్రం ద్వారా అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు సరైన వసతులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా నగరాల్లో ఎన్నో వసతులు ఉన్నా .. అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు సరైన వసతులు లేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్యా వంటి వసతులు లేక ఎండనక, వానక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి వ్యథలను ఈ సినిమాలో చక్కగా చూపించినట్టు నరేష్ వెల్లడించారు. మారేడిమిల్లిలో ప్రభుత్వం కల్పించాల్సిన సరైన సౌకర్యాలు లేకపోవడం.. అక్కడ రాజకీయ నాయకులు అక్కడ ప్రజలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూస్తుంటారు.

మారేడుమిల్లి అనే ఓ ఊరు ప్రపంచానికి దూరంగా, కనీస అవసరాలు లేకుండా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ఆ ఊరి జనం బతుకుతూ ఉంటారు. అయితే ఎన్నికల వేళ అక్కడికి ఓట్లు వేయించడం కోసం అల్లరి నరేష్ పోలింగ్ అధికారిగా తన టీంతో కలిసి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, విలన్ చేసిన కొన్ని పనుల వల్ల అల్లరి నరేష్ ని తప్పుగా భావించి ఆ ఊరి వాళ్ళు, పోలీసులు కొడతారు . ఈ నేపథ్యంలో పోలింగ్ అధికారిగా మారేడిమిల్లికి వెళ్లిన హీరో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా పరిష్కరించాడనేదే  ఈ సినిమా స్టోరీ.

కేవలం 56 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ చిత్రం ప్రవంచ వ్యాప్తంగా రూ. 4 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ కావాలంటే రూ. 4.5 కోట్లు రాబట్టాలి. ఈ సినిమాను నైజాం (తెలంగాణ)లో 150 పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. సీడెడ్ (రాయలసీమ)లో60, ఆంధ్ర ప్రదేశ్‌లో 180 పైగా థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల కానుంది. . ప్రపంచ వ్యాప్తంగా 510 పైగా థియేటర్స్‌లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేశ్ జోడీగా ఆనంది అలరించనుంది.

'జాంబీ రెడ్డి' .. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్ .. చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. అల్లరి నరేష్ హీరోగా ఈ పాటికి 'సభకి నమస్కారం' సినిమా రావలసింది. కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. దాంతో మరో సినిమాను సెట్ చేసుకున్నాడు. మొత్తంగా అల్లరి నరేష్ సిన్సియన్ ప్రభుత్వ అధికారి టీచర్ పాత్రలో మరోసారి తనదైన నటన చూపించారు.  ఇక ట్విట్టర్‌లో ప్రస్తుతం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. చూడాలి మరి లాంగ్ రన్‌లో ఎలా ఉండనుందో..

First published:

Tags: Allari naresh, Itlu Maredumilly Prajaneekam, Tollywood news

ఉత్తమ కథలు