హోమ్ /వార్తలు /సినిమా /

Allari Naresh: రాజకీయాల్లోకి అల్లరి నరేష్! ఇదిగో ఫుల్ క్లారిటీ..

Allari Naresh: రాజకీయాల్లోకి అల్లరి నరేష్! ఇదిగో ఫుల్ క్లారిటీ..

Allari Naresh Photo News 18

Allari Naresh Photo News 18

Itlu Maredumilly Prajaneekam: అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. తాజాగా ఈ సినిమాకు సంబంధింంచిన ట్రైలర్ విడుదల చేశారు. నటుడిగా నరేష్ 59వ సినిమా. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పొలిటికల్ ఎంట్రీపై నరేష్ రియాక్ట్ అయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ (Allari Naresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో, తనదైన యాక్టింగ్‌తో ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే ఆ మధ్య సరైన విజయాలు లేక సతమతమవుతున్న నరేష్‌కు గతేడాది నాంది సినిమాతో మంచి విజయం సంపాదించి పెట్టింది. అదే బాటలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ ముందుకెళుతున్నారు అల్లరి నరేష్.

ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' (Itlu Maredumilly Prajaneekam). తాజాగా ఈ సినిమాకు సంబంధింంచిన ట్రైలర్ విడుదల చేశారు. నటుడిగా నరేష్ 59వ సినిమా. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ ఇది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతోంది. హాస్య మూవీస్ - జీ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాకి, ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఏ హీరో సినిమా తీసినా.. వారికి రాజకీయాలంటే ఇంట్రస్ట్ ఉందా? రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా అల్లరి నరేష్ విషయంలో కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. ఓ మీడియా సమావేశంలో ఈ ప్రశపై తన మనసులోని మాటను బయటపెడుతూ ఓపెన్ అయ్యారు అల్లరి నరేష్.

రాజకీయాలు తనకు పెద్దగా తెలియదని, పాలిటిక్స్ అంటే తనకు ఇంట్రస్ట్ లేదని అల్లరి నరేష్ అన్నారు. గతంలో కూడా ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదని అన్నారు. సినీ ఇండస్ట్రీలో నటుడిగానే కొనసాగుతానని, దర్శకుడు కావాలనే ఆసక్తి మాత్రం ఉందని అల్లరి నరేష్ స్పష్టం చేశారు. దీంతో అల్లరోడి పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

ఈ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమాలో అల్లరి నరేష్ జోడీగా ఆనంది అలరించనుంది. 'జాంబీ రెడ్డి' .. 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో సందడి చేయనుంది. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాను నవంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.

Published by:Sunil Boddula
First published:

Tags: Allari naresh, Itlu Maredumilly Prajaneekam, Tollywood