Allari Naresh Sudigadu: అల్లరి నరేష్ (Allari Naresh Sudigadu) మార్కెట్‌ను అంతెత్తున నిలబెట్టిన సినిమాల్లో సుడిగాడు అన్నింటికంటే ముందుంటుంది. భీమినేని శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు నరేష్ కెరీర్లో లేని కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా.
తెలుగు ఇండస్ట్రీలో ఈ తరం హీరోలలో అత్యంత వేగంగా సినిమాలు చేసే హీరో అల్లరి నరేష్. మిగిలిన వాళ్లు 20 సినిమాలు చేయడానికి కూడా తంటాలు పడుతుంటే.. ఇప్పటికే కెరీర్లో 58 సినిమాలు పూర్తి చేసాడు నరేష్. అందులో ఎన్ని సక్సెస్ అయ్యాయి అనే సంగతి పక్కనబెడితే ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలలో నరేష్ ముందుంటాడు. కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. అప్పుడప్పుడూ నాంది లాంటి సినిమాలతో నటుడిగా తన స్థాయిని గుర్తు చేస్తుంటాడు. అయితే అల్లరి నరేష్ మార్కెట్‌ను అంతెత్తున నిలబెట్టిన సినిమాల్లో సుడిగాడు అన్నింటికంటే ముందుంటుంది. భీమినేని శ్రీనివాస రావు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు నరేష్ కెరీర్లో లేని కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఒక టికెట్‌పై 100 సినిమాలు అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ చిత్రం.. నిజంగానే రెండున్నర గంటల సినిమాలో 100 సినిమాలను చూపించేసింది. స్పూఫ్ సినిమా అంటే ఇలా ఉంటుందా అనేలా రెచ్చిపోయాడు సుడిగాడు.
ఈ హీరో ఆ హీరో అనే తేడా లేకుండా అందరిపై సెటైర్ల వర్షం కురిపించాడు నరేష్. ఈ సినిమాను ప్రేక్షకులు ఎగబడి చూసారు. అందుకే సుడిగాడు సినిమాకు వసూళ్ల వర్షం కురిసింది. తమిళ పడమ్ సినిమాకు రీమేక్‌గా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 24, 2012న విడుదలైంది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా విడుదలై 9 ఏళ్ళైంది. పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చిన సుడిగాడు అద్భుతమైన విజయం అందుకుంది. అల్లరి నరేష్‌కు సడన్ స్టార్ అనే బిరుదు తీసుకొచ్చింది.
అల్లరి నరేష్ సుడిగాడు సినిమా (Sudigadu movie)
సుడిగాడు ఇచ్చిన విజయంతో నరేష్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. కానీ సుడిగాడు తర్వాత వరస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డాడు నరేష్. 9 ఏళ్ళ పాటు విజయం లేక.. ఈ మధ్యే నాందితో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. 9 ఏళ్ళ కింద సుడిగాడు సినిమా వసూలు చేసిన మొత్తం ఓ సారి చూద్దాం..
ఏపీ + తెలంగాణ: 18.93 కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 1.01 కోట్లు వరల్డ్ వైడ్: 19.94 కోట్లు
సుడిగాడు కంటే ముందు నరేష్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బెట్టింగ్ బంగార్రాజు, కత్తి కాంతారావు, అహ నా పెళ్లంట లాంటి సినిమాలు విజయం అందుకున్నాయి. దాంతో సుడిగాడు అల్లరోడి కెరీర్లో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 9 కోట్ల బిజినెస్ చేసింది. ఫుల్ రన్లో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా 20 కోట్ల షేర్ వసూలు చేసింది. ఫలితంగా బయ్యర్లకు ఏకంగా 12 కోట్ల లాభాలు అందించాడు సుడిగాడు. అయితే ఈ సినిమా తీసుకొచ్చిన విజయాన్ని సరిగ్గా వాడుకోవడంలో దారుణంగా విఫలమయ్యాడు నరేష్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.