ALLARI NARESH BREATHE OF NAANDHI RELEASED AND COMEDY HERO TURNS SUPER SERIOUS ROLE PK
Allari Naresh Naandhi: అల్లరి నరేష్ ‘నాంది’ టీజర్ విడుదల.. న్యాయం కోసం ప్రాణం ఖరీదు..
అల్లరి నరేష్ నాంది టీజర్ (Naandhi teaser)
Allari Naresh Naandhi: అల్లరి నరేష్ అంటే ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే గుర్తొచ్చేది. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోకు మళ్లీ క్రేజ్ తీసుకొచ్చింది ఈయనే. చాలా వేగంగా తక్కువ సమయంలోనే 50 సినిమాలు కూడా పూర్తి చేసాడు నరేష్.
అల్లరి నరేష్ అంటే ఇన్ని రోజులు కేవలం కామెడీ మాత్రమే గుర్తొచ్చేది. రాజేంద్ర ప్రసాద్ తర్వాత కామెడీ హీరోకు మళ్లీ క్రేజ్ తీసుకొచ్చింది ఈయనే. చాలా వేగంగా తక్కువ సమయంలోనే 50 సినిమాలు కూడా పూర్తి చేసాడు నరేష్. అప్పట్లో వరస విజయాలతో దుమ్ము దులిపేసాడు కూడా. అయితే కొన్నేళ్లుగా అల్లరోడి సినిమాలు వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. అంతగా నిరాశ పరుస్తున్నాయి ఈయన సినిమాలు. అప్పుడెప్పుడో 8 ఏళ్ల కింద వచ్చిన సుడిగాడు సినిమానే అల్లరి నరేష్ చివరి బ్లాక్‌బస్టర్. మధ్యలో దాదాపు డజన్ సినిమాలు చేసినా విజయం మాత్రం పలకరించలేదు. దాంతో ఇప్పుడు అల్లరి నరేష్ ఇప్పుడు సీరియస్ నరేష్ అవుతున్నాడు. తనను తాను మార్చుకుంటున్నాడు. నటుడిగా 50 సినిమాలు పూర్తి చేసిన తర్వాత తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకుంటున్నాడు. ఇదివరకే గమ్యం, ప్రాణం, నేను లాంటి డిఫెరెంట్ సినిమాలు చేసాడు నరేష్. కానీ కామెడీ సినిమాలు హిట్ కావడంతో అలాంటి ముద్రే పడిపోయింది.
అల్లరి నరేష్ ‘నాంది’ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
గతేడాది మహర్షి సినిమా నుంచి మాత్రం తనను తాను మార్చుకుంటున్నాడు నరేష్. ఈ క్రమంలోనే ఆ సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా చాలా ఎమోషనల్ పాత్ర చేసాడు ఈ హీరో. ఇప్పుడు నాంది సినిమాతో మరోసారి తనలోని కొత్తదనం చూపిస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నాడు. ఇది అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం. ఇప్పటికే విడుదలైన 'నాంది' టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు మరో టీజర్ కూడా అలాగే ఉంది. తొలి టీజర్ అంతా ఖైదీలు, జైల్ల గురించి చెప్పిన అల్లరి నరేష్.. ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడాడు.
ఈ చరిత్రలో ప్రాణం పోకుండా న్యాయం జరిగిన సందర్భాలు లేవని చెప్పుకొచ్చాడు. 15 లక్షల మంది చనిపోతే తప్ప స్వాంతంత్య్రం రాలేదు.. 1300 మంది ప్రాణత్యాగం చేస్తే తప్ప కొత్త రాష్ట్రం రాలేదంటూ ఎమోషనల్ డైలాగులున్నాయి. న్యాయం కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే.. తనకు న్యాయమే గెలవాలంటూ తలకిందులుగా నరేష్‌ను వేలాడదీసారు. అజయ్ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోడానికి నరేష్ నాంది లాంటి సినిమాను ఎంచుకుంటున్నాడు. దాంతో ఇకపై ఇలాంటి సినిమాలే చేస్తాడేమో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.