పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు నిజమైన హీరోలు.. అల్లరి నరేష్..

ప్రస్తుతం మన దేశం కరోనా మహామ్మారి బారిన పడింది. ఈ వైరస్ కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది. తాజాగా అల్లరి నరేష్ పోలీసులకు, పారిశుద్ధ కార్మికులు చేస్తోన్న సేవలకు కొనియాడారు.

news18-telugu
Updated: April 18, 2020, 3:53 PM IST
పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు నిజమైన హీరోలు.. అల్లరి నరేష్..
పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు అల్లరి నరేష్ సెల్యూట్ (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశం కరోనా మహామ్మారి బారిన పడింది. ఈ వైరస్ కట్టడిలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది.  కరోనా ఎఫెక్ట్ దేశంలోని దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ కారణంగా ఎంతో మంది అకాల మరణం పొందారు. ఈ కరోనా వైరస్ ఇపుడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా డాక్టర్లు, నర్సులు, పోలీసులు, మీడియా,పారిశుద్ధ కార్మికులు, జల మండలి, విద్యుత్‌ వంటి  అత్యవసర సేవలు మాత్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయి.  ఈ సందర్భంగా వారు చేస్తోన్న కృషిని మెచ్చుకుంటూ ప్రధాని మోదీ పిలపు మేరకు ఒకసారి చప్పట్లతో మరోసారి దీపాల వెలుగులతో అత్యవసర సేవలు చేస్తున్న వారికి దేశ ప్రజలు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే పోలీసులు, పారిశుద్ధ కార్మికులు చేస్తోన్న సేవలను కొనియాడుతూ.. హీరో నాగ చైతన్య, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్, విజయ్ దేవరకొండ సహా పలువురు హీరోలు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తోన్న సేవలను కొనియాడారు.


తాజాగా సినీ హీరో అల్లరి నరేష్.. ఈ లాక్ డౌన్ లో మనందరి కోసం పని చేస్తున్న వైద్య బృందానికి, మీడియాకు, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు, ఇతర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు మీ ప్రాణాలకు ముప్పు అని తెలిసిన మీరు అందజేస్తోన్న సేవలు వెలకట్టలేనవి. మీరే నిజమైన హీరోలంటూ ఓ వీడియోను రిలీజ్ చేసాడు. మొత్తానికి కరోనా పై పోరాటంలో సేవలు చేస్తున్న అందరికీ సెల్యూట్ అంటూ చెప్పారు.  ‬
Published by: Kiran Kumar Thanjavur
First published: April 18, 2020, 3:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading