Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 1, 2020, 3:20 PM IST
థియేటర్స్ రీ ఓపెన్ (Theatres reopening)
ఇప్పుడు ఇదే చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. డిసెంబర్ 4 నుంచి ఏఎంబి మాల్ ఓపెన్ కానుంది. ఇదే బాటలో మరికొన్ని థియేటర్స్ కూడా డిసెంబర్లోనే ఓపెన్ అవుతున్నాయి. ఏడు నెలలుగా మూత పడి ఉన్న మల్టీప్లెక్సులు, థియేటర్స్ ఒక్కొక్కటిగా మళ్లీ తెరుచుకుంటున్నాయి. మార్చ్ నుంచి కరోనా వచ్చింది.. అప్పట్నుంచి ఇప్పటి వరకు థియేటర్స్ మూతపడే ఉన్నాయి. చరిత్రలో ఇప్పటి వరకు లేనంత.. మరెప్పుడూ రానంత నష్టాలు వచ్చాయి ఎగ్జిబిటర్లకు. 7 నెలలుగా థియేటర్స్ అన్నీ మూత పడటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే మెల్లమెల్లగా లాక్ డౌన్ సడలింపులను వాడుకుంటూ థియేటర్స్ తెరవడానికి సరే అంటున్నారు యాజమాన్యం. ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు వచ్చేసరికి అన్నీ సిద్ధం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. డిసెంబర్లో కొన్ని సినిమాలను విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు విడుదలయ్యేలా కనిపిస్తున్నాయి. అయితే అంత ధైర్యం ఎవరు చేస్తారు.. ఇన్ని రోజుల తర్వాత థియేటర్స్ ఓపెన్ చేస్తే మళ్లీ మునుపు వచ్చినట్లు జనం వస్తారా రారా అనేది అర్థం కావడం లేదు.

సోలో బ్రతుకే సో బెటర్ (Solo Brathuke So Better movie)
మార్చ్ నుంచి చాలా సినిమాలు విడుదలకు సిద్ధంగానే ఉన్నా థియేటర్స్ లేక రాలేదు. మరికొన్ని సినిమాలను ఆన్ లైన్లోనే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్లో అందరికంటే ముందు సాయి ధరమ్ తేజ్ వస్తున్నాడు. ఈయన హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటరూ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఈ మేరకు థియేటర్స్‌లోనే తమ సినిమా వస్తుందని ప్రకటించారు కూడా. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో.. సెకండ్ వేవ్ మొదలైందనే వార్తలు వస్తున్న తరుణంలో థియేటర్స్ వైపు జనం అడుగులు పడతాయా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే.

AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ఫోటోస్
మరోవైపు చాలా రోజుల తర్వాత వస్తున్న కొత్త సినిమా కావడం.. థియేటర్స్ మిస్ అవ్వడంతో ఆడియన్స్ కచ్చితంగా వస్తారని నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ నమ్మకంతోనే సాయి ధరమ్ తేజ్ సినిమా రానుంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా కూడా డిసెంబర్లోనే విడుదల కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు సుమంత్ నటించిన కపటదారి కూడా డిసెంబర్ 25నే రానుంది. మొత్తానికి మరి చూడాలిక.. థియేటర్స్‌కు పునర్వైభవం ఎప్పుడొస్తుందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
December 1, 2020, 3:20 PM IST