ఆగస్ట్‌లో థియేటర్స్ ఓపెన్.. కానీ కండీషన్స్ అప్లై..

Theatres Opening: గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ కార‌ణంగా మార్చ్ 25 నుంచి మూతప‌డిన సినిమా హాల్స్ అన్నీ మళ్లీ తెరుచుకోబోతున్నాయని ప్రచారం జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 22, 2020, 3:33 PM IST
ఆగస్ట్‌లో థియేటర్స్ ఓపెన్.. కానీ కండీషన్స్ అప్లై..
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
  • Share this:
గత రెండు నెలలుగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ కార‌ణంగా మార్చ్ 25 నుంచి మూతప‌డిన సినిమా హాల్స్ అన్నీ మళ్లీ తెరుచుకోబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కూడా కొన్ని కండీషన్స్ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వంతో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు సినీ పెద్దలు. చాలా కాలంగా షూటింగ్స్ కూడా ఆగిపోవడంతో వేలాది మంది సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. వాళ్లకు మళ్లీ పని దొరకాలంటే షూటింగ్స్ మొదలవ్వాలి.. దాంతో పాటు సినిమా హాల్స్ ఓపెన్ అయితే అక్కడ పని చేసే వాళ్లకు కూడా ఉపాధి దొరుకుతుంది.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


భౌతిక దూరం పాటిస్తూనే థియేటర్స్ ఓపెన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సినీ పెద్దలు. దీనికి సమాధానంగా ఆగస్ట్ నుంచి థియేటర్స్ తెరుచుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను మెల్లగా సడలిస్తూ వస్తుంది కేంద్రం. ఈ క్రమంలోనే వైన్ షాపులతో పాటు అన్నీ ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడు సినిమా హాల్స్ వైపు వస్తున్నాయి. ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆగస్ట్ నుంచి షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా కేవలం మూడు ఆట‌ల‌కు మాత్రమే అనుమ‌తులివ్వాలని చూస్తుంది. రాత్రి 7 గంట‌ల్లోపే మూడు షోలు పూర్తి చేయాలని నిబంధన పెట్టనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమా హాల్స్‌లో సీటుకి సీటుకి మధ్య గ్యాప్ ఉండాలని సూచించింది. ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడికి థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హించాల‌ని నిబంధ‌న విధించింది.. మాస్క్ ధ‌రించాల‌ని కోరింది.. అలాగే గ్రీన్ జోన్స్‌లోని మాల్స్ కూడా ఇదే త‌ర‌హా నిబంద‌న‌లు అమ‌లుతో అనుమ‌తి ఇవ్వ‌నున్నట్లు తెలుస్తుంది.

థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


షాపింగ్ మాల్స్ సైతం సాయంత్రం 6 గంట‌లలోగా మూసివేయాలని కేంద్రం సూచించబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సినిమా పెద్దలు కూడా ప్రభుత్వ నిబంధనలన్నింటికీ కూడా ఓకే చెప్తున్నారు. ముందు ఏదో రకంగా సగం ఆదాయమైనా వస్తుందనే భావనలో సినీ ఇండస్ట్రీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే సినీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కలవాలనే భావనలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. సినిమా విడుదల ఆగిపోవడంతో షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి.
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)
థియేటర్స్ రీ ఓపెనింగ్ (Theatres reopening)


అలా ఎంతో మంది కార్మికులకు ఉపాధి పోయింది.. షూటింగ్‌లు మొదలైతే వారికి మళ్లీ ఉపాధి వస్తుంది. అవసరమైతే ధియేటర్లలో సగం సీట్లు తాత్కాలికంగా తీసేయడానికి కూడా సిద్ధమే అని ప్రభుత్వానికి హామీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. చూడాలిక.. ఏం జరగబోతుందో..? అన్నీ కుదిరి ఆగస్ట్ నుంచి థియేటర్స్ ఓపెన్ అయితే సినిమాలు రిలీజ్ చేస్తారా.. చేస్తే వచ్చే వసూళ్లు సరిపోతాయా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading