హోమ్ /వార్తలు /సినిమా /

Allu Arjun | Ram Pothineni : అల్లు అర్జున్‌కు బైబై.. రామ్‌ పోతినేనితో బోయపాటి కొత్త సినిమా.. కారణం ఇదే..

Allu Arjun | Ram Pothineni : అల్లు అర్జున్‌కు బైబై.. రామ్‌ పోతినేనితో బోయపాటి కొత్త సినిమా.. కారణం ఇదే..

Ram Boyapati Allu Arjun Photo : Twitter

Ram Boyapati Allu Arjun Photo : Twitter

Allu Arjun : అఖండ తర్వాత బోయపాటి శ్రీను అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పట్లో ఈ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) రెడ్ సినిమా తర్వాత ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి( Krithi Shetty) హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్‌ను స్టార్ట్ చేసింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాకు అప్పుడే టైటిల్ కూడా ఖరారు కూడా అయినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్.. కొత్త సినిమాకు ఉస్తాద్ (Ustad) అనే పేరును పరిశీలిస్తున్నారట. ఇక అది అలా ఉంటే బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ (Balakrishna)తో 'అఖండ' (Akhanda) అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే రామ్‌తో సినిమా చేయడానికి బోయపాటి ఓ మాస్ కథను సిద్ధం చేశారని సమాచారం. దీనిపై అధికారిక సమచారం వెలువడాల్సి ఉంది.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. అఖండ తర్వాత బోయపాటి అల్లు అర్జున్‌ (Allu Arjun )తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ.. ఇప్పట్లో ఈ కాంబో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. బన్ని ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన (Pushpa) పుష్ప పార్ట్-1, పార్ట్-2 కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత వేణుశ్రీరామ్ తో "ఐకాన్" (Icon) సినిమా చేయాల్సి ఉంది. అంతేకాదు మధ్యలో మరోసారి త్రివిక్రమ్ లైన్లోకి వచ్చి.. మరో సినిమాను ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర లేదు. ఈ నేపథ్యంలో బోయపాటి బన్ని కోసం వెయిట్ చేసే పరిస్థితిలో లేదు. అందుకే బన్నీ కోసం వేయిట్ చేయకుండా హీరో రామ్‌కు కథ చెప్పాడట బోయపాటి (Boyapati Srinu). రామ్‌కు కూడా కథ నచ్చడంతో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాను అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారని తెలుస్తోంది.

ఇక బోయపాటి బాలయ్య అఖండ విషయానికి వస్తే.. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. బాలయ్య ఈ సినిమాలో అఘోరా లుక్‌లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే దసరాకు విడుదల అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

First published:

Tags: Allu Arjun, Ram Pothineni, Tollywood news

ఉత్తమ కథలు