హోమ్ /వార్తలు /సినిమా /

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అట్రాక్ట్ చేస్తోన్న కొత్త పోస్టర్..

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ 'బేబీ' సినిమా టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. అట్రాక్ట్ చేస్తోన్న కొత్త పోస్టర్..

బేబి టీజర్ లాంఛ్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

బేబి టీజర్ లాంఛ్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

Anand Devarakonda as Baby : యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్.దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Anand Devarakonda - Baby :  హీరో ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల నేషనల్ అవార్డ్ అందుకున్న సాయి రాజేష్ తదుపరి చిత్రం కావడం సినిమాకు ప్లస్. రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. సోమవారం చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నారు. తాజాగా టీజర్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో రోజ్ ఫ్లవర్ పెటల్స్ లో హీరోయిన్ వైష్ణవి వివిధ భావోద్వేగాలతో ఉన్నట్లు డిజైన్ చేశారు. ఈ పోస్టర్ డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతీ పోస్టర్ క్రియేటివ్ గా ఉండి సినిమా టీజర్ పై అంచనాలు పెంచాయి.

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న 'బేబీ' మూవీ సినీ ప్రియుల్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తుది హంగులు అద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'బేబీ' సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. మరోవైపు ఈయన నటిస్తున్న మరో సినిమా `హైవే`. 118, WWW లాంటి సినిమాల తర్వాత ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో వస్తున్న మూడో సినిమా ఇది. ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రంలో మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది.కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న ఆనంద్ దేవరకొండకు ‘హైవే’ మరొక కొత్త తరహా సినిమా కానుందని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌, అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్, సత్య, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చినా ఆనంద్ దేవరకొండ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు యువ హీరో ఆనంద్ దేవరకొండ. ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడిప్పుడు. ఈయన ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి గీతా ఆర్ట్స్‌ అనుబంధ సంస్థలో వస్తుంది. అదే 'బేబీ'. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై SKN, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. . వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తుంటాడు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురు చూస్తున్నాడు.. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి అంటున్నారు మేకర్స్.

నిర్మాత: ఎస్. కే. ఎన్

నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్

రచన, దర్శకత్వం: సాయి రాజేష్

సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఎడిటింగ్: విప్లవ్

ఆర్ట్: సురేష్

సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేని

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్

పీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా

కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు