పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకేసారి ఐదు సినిమాలు ఒప్పుకున్నాడు ఈయన. అందులో ముందుగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అయ్యప్పునుమ్ కోషియమ్ రీమేక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం వచ్చే ఏడాది డేట్స్ ఇచ్చాడు పవన్. సాగర్ కే చంద్ర దర్శకుడు. ఈ రెండు సినిమాల తర్వాత క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు పవర్ స్టార్. ఇది పూర్తిగా పీరియాడిక్ స్టోరీ. కోహినూర్ వజ్రం నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ దొంగగా నటించబోతున్నాడని.. రాబిన్ హుడ్ తరహా పాత్ర అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంపై కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు నాగబాబు. దాదాపు 100 కోట్లతో ఏఎం రత్నం చాలా భారీగా పవన్ సినిమాను నిర్మిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. 2021 సమ్మర్ తర్వాత క్రిష్ సినిమా పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు 2022లో తెరకెక్కనున్నాయి. ఆ తర్వాత మరో సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా క్యూలోనే ఉన్నాడు. ఈయన దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతుందని.. ఇప్పటికే దీనికోసం ఓ లైన్ కూడా అనుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం.

పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ (pawan kalyan puri jagannadh)
ప్రస్తుతం పవన్ ఒప్పుకున్న సినిమాలు పూర్తైన తర్వాత పూరీ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత పవన్ కోసం కథ రాస్తాడని తెలుస్తుంది. గతంలో ఈ కాంబినేషన్లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా కోసం రంగం సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటిస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పూరీ జగన్నాథ్ (pawan kalyan puri jagannadh)
ఈ సినిమా పూర్తిగా అవినీతి జాడ్యం గురించి ఉంటుందని తెలుస్తుంది. దేశంలో పేరుకుపోయిన అవినీతిపై పూరీ ఓ సంచలన కథ రాసుకున్నాడని.. దానిపై యుద్ధం చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మాస్, మాఫియా సినిమాలతో పాటు అప్పుడప్పుడూ ఇజం, నేనింతే, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి సినిమాలతో సందేశం కూడా ఇచ్చాడు పూరీ జగన్నాథ్. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. ఏదేమైనా పవన్, పూరీ మూడోసారి కలిస్తే అంతకంటే గుడ్ న్యూస్ అభిమానులకు మరోటి ఉండదేమో..?
Published by:Praveen Kumar Vadla
First published:December 27, 2020, 11:22 IST