Home /News /movies /

ALL INDIAN CINE WORKERS ASSOCIATION WRITES PM MODI DEMANDING A BAN ON PAKISTANI ARTISTS DIPLOMATS AND BILATERAL RELATIONS BA

అప్పటి వరకు పనిచేయం.. ప్రధాని మోదీకి సినీ ఇండస్ట్రీ లేఖ..

ప్రతీకాత్మక చిత్రం (Image:Pexels)

ప్రతీకాత్మక చిత్రం (Image:Pexels)

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో అఖిలభారత సినీ వర్కర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

    అఖిలభారత సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సినిమాలు, నటులు, ఆ దేశంతో వ్యాపారాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేసింది. అప్పటి వరకు తాము పని చేయబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించింది. దీనిపై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. కాశ్మీర్ అంతర్జాతీయ సమస్య అని దీనిపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని వాదించింది. ఈ క్రమంలో భారత సినిమాల ప్రదర్శనలను నిలిపివేస్తూ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. దీంతో అఖిలభారత సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. పాకిస్తాన్‌ నిర్మాతలు, నటులు, వ్యాపారాలను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Article 370, Bollywood news, India VS Pakistan, Jammu and Kashmir, Telugu Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు