Home /News /movies /

ALITHO SARADAGA SHOW ALI INTERESTING COMMENTS ON MARRIAGE GOSSIPS WITH SUBHA SRI SB

అలీ గురించి పుకార్లు.. ఆ హీరోయిన్ తో పెళ్లి చేసేశారు.. మరీ దారుణం

అలి

అలి

పెదరాయుడు, పుణ్య భూమి నా దేశం సినిమాల్లో ఆమె నటించారు. పదుల సంఖ్యలో వరుస సినిమాలు చేసి చిన్నవయస్సులోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి సెటిల్ అయిపోయారు.

    అలీతో సరదాగా కార్యక్రమానికి ఈ సారి గెస్ట్‌గా అప్పటి హీరోయిన్ శుభశ్రీ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. శుభశ్రీ అలీ జంటగా ఐదారు సినిమాల్లో నటించారు.అలి సరసన ఆమె హీరోయిన్‌గా నటించింది. వరుసగా సినిమాలు చేయడంలో అప్పట్లో వీరిద్దరి మధ్య కొందరు గాసిప్స్ పుట్టించారు. దీంతో వీరిద్దరికీ అప్పట్లో పెళ్లి కూడా జరిగిపోయిందని ఓ ప్రముఖ మ్యాగ్ జైన్‌లో వార్త వచ్చినట్లు అలీ ఈ కార్యక్రమంలో శుభశ్రీకి చెప్పారు. ఓ సినిమా షూటింగ్‌లో అలీ శుభశ్రీ మధ్య మ్యారేజ్ సీన్ ఉంది. దీంతో వీరిద్దరు పెళ్లి గెటప్‌లో ఉండగా.. ఎవరో దాన్ని ఫోటో తీసి బయటకు లీక్ చేశారు. ఆ తర్వాత రోజు మ్యాగ్‌జైన్‌లో శుభశ్రీ,అలీ పెళ్లైయిపోయిందంటూ వార్తను పబ్లిష్ చేశారు.

    అయితే అదే సమయంలో అలీ భార్య పుట్టింటికి వెళ్లేందుకు రైలెక్కింది. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అలీ మామగారు సదరు మ్యాగ్ జైన్ కొన్నారు. ట్రైన్‌లో కూర్చొని చదువుతున్నారు. అందులో అలీ గురించి రాసిన వార్తను చూసి షాక్ తిన్నారు. రైలులో ఆ విషయం చెప్పకుండా .. ట్రైన్ దిగగానే అలీ భార్యకు నీ భర్తకు మరో పెళ్లి జరిగిందని చెప్పారు. ఈ విషయం తెలిసిన అలీ భార్య అదే రోజు సాయంత్రం ట్రైన్ ఎక్కి తిరిగి అత్తారింటికి వెళ్లింది. దీంతో పుట్టింటికి వెళ్లిన కోడలు తిరిగి రావడం చూసిన అలీ తల్లి ఏమైందని ఆరా తీశారు. అలీ శుభశ్రీ పెళ్లి జరిగిందని బోరున విలపించింది.దీంతో అలీ వచ్చి అలాంటిదేం లేదని భార్యకు, మామగారుకు సర్ది చెప్పారు. శుభశ్రీకు పెళ్లి కూడా అయిపోయిందని.. అది సినిమాలో షూటింగ్‌కు సంబంధించిన ఫోటో అంటూ అలీ భార్యకు వివరించారు. అయితే తనకు ఈ విషయాలు ఏవీ తెలియవని చెప్పుకొచ్చింది శుభశ్రీ.

    శుభశ్రీ 90 హీరోయిన్. 14 ఏళ్లకే వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రముఖ తెలుగు నటి మాల శ్రీ.. శుభశ్రీకి అక్క. శుభశ్రీ అసలు పేరు భారతి పాండే. సినిమాల్లో వచ్చాక శుభశ్రీగా మారింది. 1993 తమిళ్ హీరో ప్రశాంత్ హీరోగా వచ్చిన ఇంగతుంబి సినిమాతో ఆమె సిల్కర్ స్క్రీన్‌పై తొలిసారిగా మెరిసింది. ఆ తర్వాత తెలుగులో తొలిసారిగా అందరూ అందరే అనే సినిమా చేసింది. గ్యాంగ్ మాస్టార్,పుణ్య భూమి నా దేశం, పెదరాయుడు,పోకిరి రాజా అంటూ వరుసగా అనే తెలుగు సినిమాల్లో కూడా శుభశ్రీ నటించింది. తెలుగులోనే కాదు తమిళ,మళయాళం, కన్నడంలో కూడా శుభశ్రీ సినిమాలు చేసింది. ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి సెటిల్ అయిపోయంది. సినిమాలకు దూరంగా ఉంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Ali, Ali show, Alitho Saradaga, Alitho saradaga show, Tollywood

    తదుపరి వార్తలు