Alitho Saradaga: పాపం.. ఆ విలన్ సిన్ చూసి అతని భార్య భయపడిందట!

alitho saradaga interview

Alitho Saradaga: ప్రముఖ తెలుగు సినీ విలన్ నటుడు జీవా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరు. ఈయన తెలుగు సినిమాలలో విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా హాస్యపాత్ర, ప్రతినాయక పాత్ర లో కూడా నటించాడు.

  • Share this:
    Alitho Saradaga: ప్రముఖ తెలుగు సినీ విలన్ నటుడు జీవా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పేరు. ఈయన తెలుగు సినిమాలలో విలన్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా హాస్యపాత్ర, ప్రతినాయక పాత్ర లో కూడా నటించాడు. తెలుగులోనే కాకుండా తమిళ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించాడు. ఈయన వరుస సినిమాల్లో నటించి తన పాత్రలకు మంచి గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంటే ఈయన ఒక సీన్ చూసి తన భార్య భయపడిందట.

    జీవా తాజాగా ఓ షో లో పాల్గొనగా తన సినీ పరిచయం గురించి, వ్యక్తిగత విషయాల గురించి కొన్ని పంచుకున్నాడు. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో జాలీగా షో గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ షోలో సినీ నటుడు ఆలీ ప్రతి ఒక్క సినీ నటుల వ్యక్తిగత విషయాలను తన షో ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ షోకు ఇద్దరు సినీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటులు జీవా, బెనర్జీ ఈ వారం తమ విషయాలు పంచుకోవడానికి ఈ షోలో పాల్గొన్నారు.

    ఇక తమ సినీ పరిచయం, వ్యక్తిగత విషయాల గురించి కొన్ని విషయాలు తెలిపారు ఈ ఇద్దరు. అంతేకాకుండా ఆలీ తమ ఫ్యామిలీ గురించి ప్రశ్నించగా.. వాళ్లు కొన్ని విషయాలు పంచుకున్నారు. ఇక ఆలీ.. జీవాను ' మీ నటన చూసి మీ పిల్లలు మెచ్చుకునే వాళ్లా' అని ప్రశ్నించగా.. జీవా నవ్వుతూ.. తను చేసిన సినిమాలను చూసి 'భలే చేశారు నాన్న' అని ఎప్పుడూ అనలేదట. ఇక ఆయన తన భార్యతో కలిసి గుంటూరులో.. తను నటించిన గులాబీ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లారట. ఇక ఆ సినిమాలో ఓ సన్నివేశంలో జీవా ఓ అమ్మాయిపై పెట్రోలు పోసి నిప్పు అంటించిన సీన్ తన భార్య చూసి భయపడిందట. ఇక ఆయన వెంటనే ఇది సినిమాలే. భయపడాల్సింది ఏమీ లేదని తనతో అనడంతో ఆమె దైర్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: