హోమ్ /వార్తలు /సినిమా /

'అలిపిరికి అల్లంత దూరంలో " ఫస్ట్ లుక్ లాంచ్

'అలిపిరికి అల్లంత దూరంలో " ఫస్ట్ లుక్ లాంచ్

అలిపిరికి అల్లంతదూరంలో ఫస్ట్ లుక్ లాంచ్

అలిపిరికి అల్లంతదూరంలో ఫస్ట్ లుక్ లాంచ్

ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా వుంది. 

  'అలిపిరికి అల్లంత దూరంలో "  సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు...స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి. కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

  రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దర్శకురాలు నందిని రెడ్డి లాంచ్ చేసి యూనిట్ కు బెస్ట్ విశేష్ అందించారు. ఫస్ట్ లుక్ లో ఒక హొటల్ టెర్రస్ పై హీరో సీరియస్ గా నిలుచుని చూడటం, బ్యాగ్రౌండ్ లో తిరుమల సప్తగిరులు కనిపించడం ఆసక్తికరంగా వుంది. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి

  లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  తిరుపతిలోనే షూటింగ్ మొత్తం జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా, డీవోపీ గా డిజికె, ఎడిటర్ గా సత్య గిడుతూరి పని చేస్తున్నారు. ఈ సినిమాలో రావణ్ నిట్టూరు, శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి , లహరి  మొదలైన వారు నటిస్తున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Nandini Reddy, Tollywood

  ఉత్తమ కథలు