ఆలియాకి ప్రేమతో... వదిన!

Alia Gets a Special Gift from Ranbir's Sister

Chinthakindhi.Ramu | news18
Updated: June 6, 2019, 2:18 PM IST
ఆలియాకి ప్రేమతో... వదిన!
Alia Gets a Special Gift from Ranbir's Sister
  • News18
  • Last Updated: June 6, 2019, 2:18 PM IST
  • Share this:
బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్... ఈ మధ్యనే  ఇచ్చిన   ఓ  ఇంటర్వ్యూలో ఆలియా భట్ తో సంబంధాన్ని బహిరంగపరిచాడు. అంతకుముందు చాలారోజుల కిందటే దబాంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఈ రహస్యాన్ని బయటపెట్టేసింది. రణ్ బీర్ - ఆలియా భట్ ప్రేమించుకుంటున్నారంటే బాలీవుడ్ జనాలు కూడా చాలామంది నమ్మలేకపోయారు. అయితే బాలీవుడ్లో ఎవరి మీద క్రష్ ఉందంటే... క్షణం కూడా ఆలోచించకుండా రణ్ బీర్ పేరు చెప్పేసింది ఆలియా. దాంతో పుట్టిన అనుమానం మొన్న రణ్ బీర్ వివరణతో క్లియర్ అయ్యింది.

ఆలియా భట్ పెద్ద సోషల్ మీడియా పురుగు. ఆమెకి సంతోషం వేసినా... బాధేసినా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పెడుతుంటుందీ చిన్నది. రీసెంటుగా అలా పెట్టిన ఓ ఫోటో... రణ్ బీర్ - ఆలియాల మధ్య కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని ప్రతిబింబించింది. రణ్ బీర్ కపూర్ అక్క రిద్దిమ కపూర్ సహానీ... తనకు కాబోయే మరదలి మీద ప్రేమతో ఓ ఖరీదైన బ్రాస్లెట్ పంపించిందట. దాన్ని చూసి మురిసిపోయి తన సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది ఆలియా. 14 క్యారెట్ల పుత్తడితో తయారుచేసిన ఈ బ్రాస్ లెట్ మధ్యలో ఓ డైమండ్ మెరిసిపోతూ ఉంది. దీని ఖరీదు దాదాపు 28 వేల రూపాయలు ఉంటుందని అంచనా. ‘లవ్ ఇట్... థ్యాంక్యూ ఫర్ దిజ్ స్టన్నింగ్ బ్రాస్ లెట్’ అంటూ కామెంట్ పెట్టింది ఆలియా. ప్రస్తుతం  కపూర్- భట్ ఇరు కుటుంబాల మధ్య ఇప్పుడు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఆలియా భట్ సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా... దానికి ‘awww...’ అని ప్రేమగా రిప్లై ఇస్తూ వచ్చింది రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్. ఇప్పుడు ఆమె కూతురు కూడా ఆలియా మీద ప్రేమ కురిపిస్తున్న లిస్టులో చేరిపోయింది. రణ్ బీర్ కపూర్ కూడా వీలైనంత త్వరగా ఆలియాని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాలని తెగ ఉబలాటపడుతున్నాడు.

special gift from raddhima kapoor sahani


రణ్ బీర్ కపూర్ ఇప్పటికే దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వంటి హాట్ భామలతో డేటింగ్ నడిపాడు. కత్రినా కైఫ్ తో అయితే వ్యవహారం చాలా దూరమే వెళ్లింది. బీచ్ లో బికినీలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయారు. ఆలియా భట్ కూడా తన మొదటి సినిమా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కొంతకాలం డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే 35 ఏళ్ల రణ్ బీర్ కపూర్ - 25 ఏళ్ల ఆలియా భట్ పెళ్లి అనగానే సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ లెక్కన నాకు కాబోయే భార్య ఏ ఐదో క్లాసో చదువుతుండొచ్చు... అనే విధంగా కామెంట్లు పెడుతున్నాడు కుర్రాళ్లు.
Published by: Ramu Chinthakindhi
First published: June 4, 2018, 11:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading