దీపికాకు చెక్ పెట్టిన ఆలియా

2018లో పద్మావత్ తర్వాత బాలీవుడ్ లో 200 కోట్ల మార్క్ ను అందుకున్న లేడీ ఓరియంటెడ్ మూవీగా రాజీ రికార్డుల కెక్కింది.

news18-telugu
Updated: June 20, 2018, 6:20 PM IST
దీపికాకు చెక్ పెట్టిన ఆలియా
ఆలియా భట్ ప్రదాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ ‘రాజీ’ చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్నే నమోదు చేసిన రూ.100 కోట్లను వసూలు చేసింది. మొత్తంగా రూ.200 కోట్లను వసూలు చేసింది.
  • Share this:
గత కొన్నేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో లేడి ఓరియంటెడ్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తున్నాయి. రీసెంట్ గా తెలుగు, తమిళంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి ఎటువంటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే కదా. కథలో దమ్ముండాలే కానీ స్టార్ కాస్టింగ్ ను ఆడియన్స్ అంతగా పట్టించుకోవడం లేదనే విషయం ఈ మూవీ సక్సెస్ తో మరోసారి ప్రూవ్ అయింది.

లేటెస్ట్ గా బాలీవుడ్ లో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘రాజీ’ మూవీ మరోసారి కథా బలమున్న మహిళా ప్రధాన చిత్రాల సత్తా ఏమిటో చూపెట్టింది. 2018లో పద్మావత్ తర్వాత బాలీవుడ్ లో 200 కోట్ల మార్క్ ను అందుకున్న లేడీ ఓరియంటెడ్ మూవీగా రాజీ రికార్డుల కెక్కింది. ఈ విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసరైన కరణ్ జోహార్ అఫీషియల్ గా ట్వీట్ చేసాడు. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన ‘రాజీ’ మూవీని మేఘనా గుల్జార్ అనే మహిళ డైరెక్ట్ చేయడం విశేషం.


Published by: Kiran Kumar Thanjavur
First published: June 20, 2018, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading