ALIA BHATT RRR MOVIE SITA LOOK RELEASED DUE TO ALIA BIRTHDAY TA
Alia Bhatt - RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి సీతగా ఆలియా భట్ లుక్ విడుదల..
‘సీత’గా ఆలియా భట్ లుక్ విడుదల (Twitter/Photo)
Alia Bhatt as Sita In RRR Movie | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆలియా భట్ పుట్టినరోజు సందర్భంగా సీత లుక్‌ను విడుదల చేసారు.
Alia Bhatt as Sita In RRR Movie | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా హైపును పెంచుతూ.. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది.
ఆ తర్వాత ఇటీవల భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ విడుదలైంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అదిరిపోయింది టీజర్. ఎన్టీఆర్ నటనకు తగ్గట్లు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అదిరింది. తాజాగా ఈ సినిమా నుంచి సీతగా ఆలియా భట్ లుక్‌ను విడుదల చేసారు.
సీతగా ఆలియా భట్ (Twitter/Photo)
ఇప్పటికే సీతగా ఆలియా భట్ ప్రీ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్.. తాజాగా సీతగా ఆలియా పూర్తి స్థాయి లుక్‌ను విడుదల చేసారు. ఈ లుక్‌లో ఆలియా భట్ సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తోంది. తన ప్రియుడు రామరాజు కోసం ఎదురు చూసే యువతి పాత్రలో నటిస్తోంది.
Strong-willed and resolvent SITA's wait for Ramaraju will be legendary!
ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని నటిస్తున్నారు. ప్రస్తుతం ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్తో పాటు ఈమె కథానాయికగా నటించిన ‘గుంగుబాయ్ కతియావాడి’ సినిమా చేసింది. ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. మరోవైపు అమితాబ్, నాగార్జున ముఖ్యపాత్రల్లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.