ఆ.. అడవుల్లో తిరగడంతో ముఖం ఎర్రగా మారింది : రామ్ చరణ్ భామ..

Alia Bhatt : అలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయిన తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు.

news18-telugu
Updated: September 9, 2019, 12:00 PM IST
ఆ.. అడవుల్లో తిరగడంతో ముఖం ఎర్రగా మారింది : రామ్ చరణ్ భామ..
Instagram/aliaabhatt
  • Share this:
Alia Bhatt : అలియా భట్.. తన తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయిన తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత వచ్చిన 'డియర్ జిందగీ', 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అది అలా ఉంటే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రేమలో ముగి తేలుతున్నారని గత కొంత కాలంగా హిందీ ఇండస్ట్రీలో వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇటీవలే ఈ ఇద్దరూ కలిసి ఓ ఫారెన్ ట్రిప్ కూడా వేశారు. అంతేకాదు ముంబైలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా కలిసి ఫంక్షన్స్‌కు హాజరవ్వడం తెలిసిందే.  దీంతో వీరి పెళ్లి అతి త్వరలో జరగనుందని అనుకున్నారంత. అయితే రణ్‌బీర్ తండ్రి రిషీ కపూర్ అనారోగ్యం సరిగా లేకపోవడంతో పెళ్లి వాయిదాపడిందని కూడ ఆ మధ్య ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఆ వార్తను నిజం చేస్తూ.. అంతా కోలు కున్నాక వీరి పెళ్లి.. 2020లో జరగనుందని సమాచారం.
 View this post on Instagram
 

Sun-blushed/burnt 🌞


A post shared by Alia 🌸 (@aliaabhatt) on

అది అలా ఉంటే.. హిందీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిస్తున్న అలియా.. రాజమౌళి RRR సినిమాతో తెలుగులో కూడ ప్రవేశించనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. RRR సినిమా 2020 జులై 30 న విడుదల కానుంది. అది అలా ఉంటే అలియా ప్రస్తుతం కెన్యా అడవుల్లో స్వేచ్చా విహారం చేస్తోంది. మేకప్ లేకుండా ఆ అడవుల్లో తిరుగుతూ.. ఉండడం వలన తన ముఖం ఎండకు వాడిపోయిందని తెలుపుతూ దానికి సంబందించిన కొన్ని ఫోటోస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోస్ వైరల్‌గా మారాయి. 
View this post on Instagram
 

.. let’s wander where the Wi-Fi is weak 🌿


A post shared by Alia 🌸 (@aliaabhatt) on
First published: September 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading