ALIA BHATT PRE LOOK FROM RRR FIRST LOOK RELEASE TOMORROW ON HER BIRTHDAY MNJ
Alia Bhatt: ఆర్ఆర్ఆర్ నుంచి అలియా ప్రీ లుక్.. రాముడి సన్నిధిన సీత
అలియా భట్
Alia Bhatt RRR: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపిస్తుండగా.. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Alia Bhatt RRR: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా జక్కన్న ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపిస్తుండగా.. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా సోమవారం అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల టీమ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అందులో రాముడి సన్నిధిన అలియా భట్ కూర్చొని ఉంది. దానికి రాముడి కోసం సీత చాలా కాలంగా ఎదురుచూసింది. అయితే మీరు త్వరలోనే ఆమెను చూడబోతున్నారు అని కామెంట్ పెట్టారు. ఇక ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక సోమవారం ఉదయం 11 గంటలకు అలియా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
కాగా రియల్ కారెక్టర్స్‌తో కూడిన ఫిక్షన్ కథాంశంతో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతోంది. బాహుబలి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ సహా పలువురు భారతీయ నటీనటులు భాగం అయ్యారు. అలాగే హాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారు.
ఇక మరోవైపు బాలీవుడ్లో గంగుబాయ్ కథైవాడి అనే చిత్రంలో అలియా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో అలియా సెక్స్ వర్కర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకోగా సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.