Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 8, 2019, 10:08 AM IST
ఆలియా భట్ (Photo: aliaabhatt/Instagram)
అదేంటి.. వంటలక్క అంటే ఒక్కరే ఉన్నారు కదా.. అది కూడా కార్తికదీపం అంటారు కదా మళ్లీ ఇప్పడు అలియా భట్ వంటలక్క కావడం ఏంటి అనుకుంటున్నారా..? అలియా భట్ అంటే ఇన్ని రోజులు కేవలం హిందీలోనే వినిపించింది. కానీ ఈ పేరు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగానే వినిపిస్తుంది. దానికి కారణం దర్శక ధీరుడు రాజమౌళి. ఈయన తెరకెక్కిస్తున్న RRR సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయింది. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంది అలియా భట్. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నాడు.

ఆలియా భట్ అండర్ వాటర్ ఫోటోషూట్
ఈ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తుంది. దాంతో టాలీవుడ్లో ఈమె పేరు బాగానే వినిపిస్తుందిప్పుడు. ఇందులో తక్కువ నిడివి ఉన్న పాత్రలోనే నటిస్తుంది అలియా. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ రొమాన్స్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆలియా ఈ మధ్యే సొంత యూ ట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది.
అందులో తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు ఇష్టమైన రెండు వంటలను తన వ్యక్తిగత అసిస్టెంట్స్ నుంచి నేర్చుకుంది ఈ భామ. అవే వంటలను ఇప్పుడు తన ఫ్యాన్స్ కోసం చేసింది ఈ బ్యూటీ. అలియా పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికే 1.5 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకోవడం విశేషం. ఇక ఈ వీడియోని చూసిన ఆమె ఫ్యాన్స్ కూడా బాగానే ఖుషీ అవుతున్నారు. మొత్తానికి అలా వంటలక్క అయిపోయింది అలియా భట్.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 8, 2019, 10:08 AM IST