ప్రియాంక చోప్రా పాత్రకు ఎసరు పెట్టిన ఆలియా భట్..

బాలీవుడ్ నటి ఆలియా భట్.. ప్రియాంక చోప్రా చేయాలనుకున్న పాత్రను తాను ఎగురేసుకుపోయింది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: October 17, 2019, 8:10 AM IST
ప్రియాంక చోప్రా పాత్రకు ఎసరు పెట్టిన ఆలియా భట్..
ప్రియాంక చోప్రా, ఆలియా భట్ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ నటి ఆలియా భట్.. ప్రియాంక చోప్రా చేయాలనుకున్న పాత్రను తాను ఎగురేసుకుపోయింది. వివరాల్లోకి వెళితే..  బాలీవుడ్‌లో ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి. అలాగే బీటౌన్‌లో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీది డిఫరెంట్ స్టైల్. ముఖ్యంగా చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో భన్సాలీకి తిరుగులేదని ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’ సినిమాలతో నిరూపించుకున్నాడు. మరోవైపు భన్సాలీ తెరకెక్కించిన చిత్రాల్లో చరిత్రను వక్రీకరించారని కొంత మంది వాదన. వాటి సంగతి పక్కన పెడితే వెండితెరపై ఆయన తెరకెక్కించిన ఒక్కో చిత్రం ఒక్కో దృశ్యకావ్యంగా నిలిచిపోయాయి. గతేడాది ‘పద్మావత్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న భన్సాలీ... సల్మాన్, ఆలియా భట్‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనకుంటున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ నుంచి సల్మాన్ ఖాన్ పక్కకు తప్పుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం ఆలియా భట్ భన్సాలీకి బల్క్ డేట్స్ కేటాయించింది.దీంతో భన్సాలీ..ప్రియాంక చోప్రాతో తెరకెక్కించాలనుకున్న ‘గంగూ భాయ్ కతియావాడి’  అనే లేడి ఓరియంటెడ్ సినిమాను ఆలియా భట్‌తో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు ఈ సినిమాను 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

alia bhatt play gangubai kathiyawadi character in the place of priyanka chopra under sanjay leela bhansali direction,priyanka chopra,priyanka chopra alia bhatt,alia bhatt,gangubai kathiawadi,gangubai alia bhatt,alia bhatt sanjay leela bhansali,alia bhatt interview,alia bhatt in gangubai kathiawadi,alia bhatt as gangubai kathiawadi,alia bhatt and ranbir kapoor,alia sanjay leela bhansali film,alia salman,alia bhatt gangubai,alia bhatt as gangubai,alia bhatt in gangubai,gangubai kathiyawadi movie,sanjay leela bhansali,gangubai trailer,gangubai movie alia bhatt,bollywood,hindi cinema,ప్రియాంక చోప్రా,ఆలియా భట్,ఆలియా భట్ ప్రియాంక చోప్రా,ఆలియా భట్ గంగూబాయి కతియావాడి,సంజయ్ లీలా భన్సాలీ,సంజయ్ లీలా భన్సాలీ గంగూబాయి కతియావాడి,బాలీవుడ్,హిందీ సినిమా
ఆలియా భట్,సంజయ్ దత్ (News18/Hindi)


ముంబాయి రెడ్ లైట్ ఏరియాలో కామాటిపురా ఎంతో ఫేమస్.  ఆ ప్రాంతానికి చెందిన గంగూబాయి అంటే అక్కడివారు వణికిపోయేవారు. అంతేకాదు ఆమెను ‘మేడమ్ ఆఫ్ కామాటిపుర’గా పిలిచేవారు. చిన్నతనంలో తనకు తెలియకుండా వ్యభిచార కూపంలో కూరుకు పోయిన ఆమె... ఆ తర్వాత రౌడీరాణిగా ఎదిగింది. ముంబాయిలో ఆమె నడిపిన వ్యభిచార గృహాల గురించి ఈ చిత్రం లో చూపించబోతున్నట్టు సమాచారం.మొత్తానికి ‘పద్మావత్’ వంటి వివాదస్పద మూవీ తర్వాత భన్సాలీ తెరకెక్కించబోతున్న‘గంగూ భాయ్ కతియావాడి’ మూవీ బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading