• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALIA BHATT MOTHER SONI RAZDAN ON NEPOTISM SAYS THOSE WHO HAVE MADE IT ON THEIR OWN WILL ALSO HAVE KIDS SR

నెపోటిజంపై ఆలియా భట్ తల్లి కీలక వ్యాఖ్యలు.. వారికి టైం వస్తుంది..

నెపోటిజంపై ఆలియా భట్ తల్లి కీలక వ్యాఖ్యలు.. వారికి టైం వస్తుంది..

తల్లితో ఆలియా భట్ Photo : Twitter

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని లేపింది.

  • Share this:
    బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని లేపింది. ఆయన మరణం తర్వాత బీటౌన్‌లో నెపోటిజంపై పెద్ద ఉద్యమం మొదలైంది. సినీ ఇండస్ట్రీ కొందరి ఆధిపత్యం వలననే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా చర్చించుకుంటున్నారు నెటిజన్స్. అయితే నటుడు సూశాంత్ మరణానికి కారణం సల్మాన్ ఖాన్, అలియా భట్‌, ఏక్తా కపూర్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్‌లే అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. సుశాంత్ బీహర్‌ చెందిన వాడు కావడంతో కొంత సెంటిమెంట్‌గా ఫీల్ అయిన అక్కడి ప్రజలు బీహార్‌లో సల్మాన్‌ ఖాన్, ఆలియా భట్ సినిమాలను బ్యాన్ చేస్తామని కూడా అంటున్నారు. ఇలా నెపోటిజంపై పెద్ద ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో ఆలియా భట్ తల్లి సోని రజ్ధాన్ బంధు ప్రీతి లేదా నెపోటిజంపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.


    ట్విట్టర్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ‘ఫలానా వారి కొడుకు, కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద చాలా అంచానాలు ఉంటాయి. ఈ రోజు బంధుప్రీతి గురించి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న వీరు ఏదో ఒక రోజు తమ సొంత బిడ్డల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. అప్పుడు ఏం చేస్తారు.. వారికి ఎం చెప్పి ఆపుతారు’ అని ప్రశ్నించింది.
    First published:

    అగ్ర కథనాలు