ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఆలియా భట్ బై బై చెప్పినట్లేనా..

RRR : ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది.

news18-telugu
Updated: July 9, 2020, 7:14 AM IST
ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు ఆలియా భట్ బై బై చెప్పినట్లేనా..
ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter
  • Share this:
RRR Update : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌ టైటిల్‌తో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో  రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. రాజమౌళి తెలుగు టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది.  పూణే షెడ్యూల్‌లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృంద చెప్పుకొచ్చింది. అయితే ఏవో కారణాలతో పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వచ్చింది. దీనికి తోడు కరోనా లాక డౌన్ కూడా తోడవ్వడంతో ఆలియా ఇప్పటి వరకు టీంతో జాయిన్ కాలేదు. కాగా బాలీవుడ్ బిజీ నటీమణులలో ఆలియా భట్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం అదిరిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె RRR సినిమాతో పాటు, గంగూబాయ్, సడక్ 2, బ్రహ్మస్త్రలో నటిస్తోంది. దీంతో ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చిన ఆలియా భట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టతరంగా మారిందట. కరోనా కారణంగా వాయిదా పడ్డ పూణే షెడ్యూల్ ఎప్పుడు మొదలుకానుందో తెలియని పరిస్థితి. దీంతో ఆలియా భట్ అందుబాటులో ఉంటుందా అనేది సందేహంగా ఉందట.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోగా, పరిస్థితి ఓ కొలిక్కి రాగానే షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఆలియా మాత్రం.. తనకు ఖాలీగా లేదని.. తరువాతి ప్రాజెక్ట్ లోకి వెళతానని, అందుకు అంగీకరించాలని రాజమౌళిని కోరినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆలియాకు చెందిన భాగాన్ని ఇప్పటివరకూ షూటింగ్ జరుపలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఆలియానే ఒప్పిస్తారా లేదా ఎన్టీఆర్ హీరోయిన్‌ను మార్చినట్టే రామ్ చరణ్‌కు కూడా మరో హీరోయిన్‌ను తెస్తారా అని ఆసక్తితో చూస్తున్నారు సినీ అభిమానులు.
Published by: Suresh Rachamalla
First published: July 9, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading