హోమ్ /వార్తలు /సినిమా /

కారును వెంబడిస్తూ ఆలియా ఫ్యాన్ పరుగులు..‘డెడ్’ అంటూ స్పందించిన హీరోయిన్

కారును వెంబడిస్తూ ఆలియా ఫ్యాన్ పరుగులు..‘డెడ్’ అంటూ స్పందించిన హీరోయిన్

ఆలియా కోసం ఫ్యాన్ పరుగులు

ఆలియా కోసం ఫ్యాన్ పరుగులు

కబీర్ సింగ్‌ సినిమాలో షహీద్ కపూర్‌ను తలపించేలా రోడ్డుపై ఆలియా ఫ్యాన్ పరుగులు తీశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కొందరు సెలబ్రిటీలకు పిచ్చి ఫ్యాన్స్ ఉంటుంటారు. వారి కోసం ఏదైనా చేసేందుకు రెడీ అయిపోతుంటారు. తమకు నచ్చిన హీరో హీరోయిన్ కనిపిస్తే.. ఎవర్నీ లెక్క చేయకుండా తమ అభిమాన హీరోలను హీరోయిన్లను కలిసేందుకు పోటీ పడుతుంటారు. ఇలాంటి సీన్స్ మనం చాలామంది సెలబ్రిటీల విషయంలో ప్రత్యక్షంగా చూశాం కూడా. అయితే ఫ్యాన్స్ చేసిన కొన్ని పనులతో ఇబ్బంది పడిన సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. కొందరు అయితే హీరో హీరోయిన్లకు వేరే వాళ్లతో పెళ్లి అవుతున్నా కూడా తట్టుకోలేరు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ రకరకాల పోస్టులు పెడుతుంటారు, తాజాగా ఓ నెటిజన్ అలాంటి పనే చేశాడు.

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లి జరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ఈనెల 14న మూడు ముళ్లు వేయించుకోనుంది. అయితే ఈ క్రమంలో ఆలియా ఫ్యాన్స్ రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఓ నెటిజన్ ఆలియా-రణ్‌బీర్ పెళ్లి జరగడం తట్టుకోలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టులో.. అతడు ఓ కారును వెంబడిస్తూ పరుగులు తీశాడు, ఆ కారు వెనుక భాగాన ఆలియా వెడ్స్ రణ్‌బీర్ అని రాసుంది. అతడు ఆ కారును వెంబడిస్తూ వీడియో తీసి పోస్టు చేశాడు. అయితే చూడటానికి ఆ సీన్ అచ్చం కబీర్ సింగ్ సినిమాలో హీరోయిన్ కియార పెళ్లైపోతుంటే.. హీరో షాహిద్... రోడ్డుపై పరుగెత్తినట్లుగానే కనిపించింది.

ఆ తర్వాత ఆలియా భట్ పక్కనే తాను ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ తర్వాత తన స్థానంలో రణ్‌బీర్ ఉన్నట్లు కూడా ఫోటోను మార్ఫింగ్ చేశాడు. అయితే ఈ వీడియోను చూసినా ఆలియా కూడా స్పందించింది. ‘డెడ్’ అంటూ కామెంట్ చేస్తూ పోస్టు పెట్టింది. దీంతో ఇప్పుడు ఫ్యాన్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఆలియా పెళ్లంటే మామూలు విషయమా . పాపం ఎంతమంది ఫ్యాన్స్ ఇలా బాధపడిపోతున్నారో బయటకు చెప్పుకోలేక.

మరోవైపు ఈ ముద్దుగుమ్మ మాత్రం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా మారింది. రేపట్నుంచి మూడు రోజుల పాటు ఆలియా రణ్‌బీర్ పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మెహందీ ఫంక్షన్‌ జరగనుంది. 14వ తేదీన వీరిద్దరు వివాహం జరిపించనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 17న ముంబైలో ఘనంగా అతిథులందరికీ మ్యారేజ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

First published:

Tags: Alia Bhatt, Bollywood, Ranbir Kapoor

ఉత్తమ కథలు