హోమ్ /వార్తలు /సినిమా /

Alia Bhatt Ranbir kapoor: విరహ వేదనను భరించలేక.. ప్రియుడి ‘దగ్గరికే’ అలియా

Alia Bhatt Ranbir kapoor: విరహ వేదనను భరించలేక.. ప్రియుడి ‘దగ్గరికే’ అలియా

alia bhatt (photo Instagram)

alia bhatt (photo Instagram)

Bollywood లో Love Birds గా చెలామణి అవుతున్న జంటలలో ప్రముఖ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir kapoor), అలియా భట్ (Alia Bhatt) ఒకటి. ఈ జంట చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉంది.

  • News18
  • Last Updated :

Bollywood లో Love Birds గా చెలామణి అవుతున్న జంటలలో ప్రముఖ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir kapoor), అలియా భట్ (Alia Bhatt) ఒకటి. ఈ జంట చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉంది. రణ్బీర్ ఇంట్లో ఏం ఫంక్షన్ జరిగినా అలియా హాజరు కావడం.. అలియా ఫ్రెండ్స్ తో కలిసి రణ్బీర్ పార్టీలకు విదేశాలకు వెళ్లడం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వార్తలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. తాజాగా ఈ జంటకు చెందిన ఒక హాట్ న్యూస్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో ఆమె డబ్బులెన్నైనా సరే..  రణ్బీర్ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఉండాలని నిశ్చయించుకుందట.

అలియా భట్.. ప్రియుడి విరహ వేదనను తట్టుకోలేకపోతుందట. అందుకే రణ్బీర్ ఉంటున్న ప్లాట్ కు దగ్గరగా ఉండాలని నిశ్చయించుకుందట. ఇందుకోసం.. రణ్బీర్ ఉంటున్న ముంబయిలోని పాలి హిల్ ప్రాంతంలో ని అపార్ట్మెంట్ లోనే ఉండాలని నిశ్చయిందుకుందని బాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రణ్బీర్ ఉంటే అపార్ట్మెంట్ లో.. అతడు 7 వ అంతస్తులో ఉంటుండగా.. అలియా 5 వ అంతస్తు లో ప్లాట్ కొనుగోలు చేసిందని సమాచారం.2,460 చదరపు అడుగులు ఉన్న ఈ ప్లాట్ ధర ఏకంగా రూ. 32 కోట్లు ఉందట. ధర ఎక్కువైనా.. తన ప్రియుడితో కలిసి ఉండటానికి డబ్బుల గురించి కూడా ఆలోచించలేదట ఈ అమ్మడు. అంతేగాక... ఈ ప్లాట్ లో ఇంటీరియర్ డిజైన్ ను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Sharukh Khan) భార్య గౌరీ ఖాన్ తో చేయించుకుందని సమాచారం.

అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ఈ జంట ఒక్కటవ్వటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రేమ పక్షులిద్దరూ అలియా కొన్న కొత్త ఇంటిలోనే దీపావళి వేడుకలు కూడా చేసుకున్నారని బాలీవుడ్ వెబ్సైట్ల కథనం. వీరిరువురూ కలిసి.. ప్రస్తుతం బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తున్నారు. ఇక అలియా భట్ తెలుగులోనూ దిగ్దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లోనూ నటించనున్న విషయం తెలిసిందే.

First published:

Tags: Alia Bhatt, Bollywood, Bollywood heroine, Bollywood news, Ranbir Kapoor, VIRAL NEWS

ఉత్తమ కథలు