బాలీవుడ్ యంగ్ కపుల్ రణబీర్ కపూర్, ఆలియా భట్ తల్లిదండ్రులు అయ్యారు. పెళ్లైన కొన్నినెలలుకే వీరిద్దరు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. ఆలియా కాసేపటి క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆదివారం ఉదయం ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో ఆలియా భట్ తన భర్తతో కలిసి వచ్చింది. డెలివరీ టైం దగ్గర పడటంతో ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. ఆ తర్వాత ఆలియా తల్లి సోని రజ్దాన్ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
ఆలియా రణ్ బీర్ ఈ ఏడాది ఏప్రెల్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం జరిగినకొన్ని రోజులకే... ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న పిక్‌ను పోస్టు చేసింది. ఈ పిక్‌లో రణ్ బీర్ కపూర్ ఉన్నాడు. అక్టోబర్‌లో కపూర్ ఫ్యామిలీ ఆలియాకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు.. పలువురు సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు. ఆలియా సీమంతం పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
మరోవైపు ఆలియా విషయానికి వస్తే.. ఈ భామ ప్రెగ్నెన్సీ టైంలో కూడా సినిమాల్లో, షూటింగుల్లో పాల్గొంటూ... సందడి చేసింది. బ్రహ్మస్త్ర ప్రమోషన్లలో కూడా బేబీ బంప్‌తో కనిపించింది ఆలియా. బ్రహ్మస్త్రలో ఆలియా రణ్‌బీర్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత ఓ హిట్ అందించింది.
ఇక ఆలియా తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమురం భీమ్‌గా చేయగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతరామ రాజు పాత్రలో నటించారు. ఈ సినిమాలో అలియా భట్ సీత పాత్రలో కనిపించారు. సీత పాత్రలో ఆమె నటనతో అందర్నీ మెప్పించారు. ఆలియా నటించిన గంగూభాయి కతియవాడి సినిమా కూడా విమర్శకుల చేత ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Ranbir Kapoor