Home /News /movies /

ALIA BHATT AJAY DEVGN GANGUBAI KATHIAWADI MOVIE RELEASE ON FEBRUARY 25TH HERE ARE THE DETAILS TA

Alia Bhatt - Gangubai Kathiawadi : ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ విడుదల తేది ఖరారు..

ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ మూవీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

ఆలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ మూవీ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

Alia Bhatt - Gangubai Kathiawadi :  ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. ప్రస్తుతం ఈమె నటించిన ’ఆర్ఆర్ఆర్’తో పాటు గంగూబాయ్ కతియావాడి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ’గంగూబాయి కతియావాడి’ సినిమా విడుదల తేదిని అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Alia Bhatt - Gangubai Kathiawadi :  ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన తండ్రి దర్శక, నిర్మాత  మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో సీత పాత్రలో నటించింది. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఏప్రిల్ 28న విడుదల కానుంది. అది అలా ఉంటే ఆలియా భట్ హిందీలో పలు సినిమాలను చేస్తున్నారు. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా 'గంగూబాయి కతియావాడి'. ఈ సినిమాను ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసారు.

    ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌ గంగూబాయి గురించి చర్చించనున్నారు. ఎస్ హుస్సేన్ జాడి రచించిన మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై నవల ఆధారంగా గుంగుబాయి తెరకెక్కింది. మరో ముఖ్య పాత్రలో ఆర్ఆర్ఆర్ హీరో అజయ్ దేవ్‌గణ్ నటించారు.  ఈ సినిమా జనవిరి 6న విడుదల కావాల్సింది. కానీ ఆర్ఆర్ఆర్ కారణంగా వాయిదా పడింది.గంగుభాయ్ కతియావాడి చిత్రాన్ని ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఆ రోజున కాకుండా ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.



    ఇక ఆలియా భట్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకం తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్‌లో ఆలియా కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొమురం భీమ్‌గా చేస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతరామ రాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆలియా భట్ సీత పాత్రలో కనిపించనున్నారు.

    ‘బంగార్రాజు’ 2 వారాల బాక్సాఫీస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్‌కు కాస్త దూరంలో..

    ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది.  ఇక ఈ సినిమా నుంచి ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా దోస్తీ పేరుతో విడుదలైన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Alia Bhatt, Bollywood news, Gangubai Kathiawadi, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు