సోషల్ మీడియాలో (social media) అలియా భట్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. స్వతహాగా మంచి ఫుడీ అయిన అలియా తమ మాటల్లో డైటింగ్ గురించి వివరించటం కాస్త ఫన్నీగా ఉన్నప్పటికీ ఆసక్తిగా ఉంది కూడా. తన సొంతమాటల్లో ఫుడ్ గురించి గడగడ మాట్లాడే ఈ బిజీ స్టార్ గతంలోలా కాకుండా తను ఆహారంతో కొత్తరకమైన రిలేషన్ తో ఉన్నట్టు వెరైటీగా చెప్పుకొచ్చారు అలియా. 27 ఏళ్ల అలియాకు మంచి టేస్ట్ ఉంది, రకరకాల ఆహారాన్ని లొట్టలేసుకుని తినటాన్ని తాను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తానని బాహాటంగా చెప్పే ఈమె.. ప్రస్తుతం వెండితెరపై హాట్ గా కనిపించేందుకు చాలా అలవాట్లు మార్చుకున్నట్టు చెబుతారు. మెరుపుతీగలా మెరిసిపోవాలంటే తినే ఆహారంపై నియంత్రణ ఉండటం చాలా అవసరం కనుక నోరు కట్టేసుకుంటున్నట్టు, గతంలోలా ఇష్టమైన ఆహారాన్ని అలా లాగించటం లేదని కుండబద్ధలు కొడుతూ.. ఈ వైరల్ వీడియోలో నవ్వించారు.
అలియా వాటర్ డైట్
బాగా ఆకలేసినప్పుడు అలాగే తింటూ ఉండద్దని సలహా ఇస్తున్న అలియా .. చాలాసార్లు మనకు ఆకలి వేస్తుంది. కానీ అది నిజమైన ఆకలి కాదు కానీ దాహం మాత్రమేనని వివరిస్తున్నారు. హ్యూమన్స్ గా మనం తాగాల్సినంత నీరు తాగటం లేదు, అందుకే ఆకలి కేకలు వినిపిస్తే ఆహారానికి బదులు నీరు తాగాలని చెబుతోంది. ఇలా దాహమైనా ఆకలి అనుకుని మంచింగ్ చేస్తూపోతే అనవసరంగా అతిగా ఆహారాన్ని తింటాం కనుక బరువు పెరుగుతామని అలియా వివరిస్తున్నారు.
ఎవరైనా రోజుకు రెండు నుంచి మూడు సార్లు మాత్రమే భోజనం చేయాలి కానీ అంతకంటే ఎక్కువసార్లు తినటం మంచిదికాదనే ఈ స్టార్ మనమంతా అదనంగా లాగించేస్తున్నామనే విషయం గుర్తుచేస్తున్నారు. పదేపదే తినటం మంచిది కాదంటూనే ఆకలి వేసినప్పుడు నీరు తాగటాన్ని కొత్త సంవత్సరంలో అలవాటు చేసుకోవాలని విలువైన సూచన చేశారు. ఇలా తినటం సరైన విధానమే కాదు, ఫుడ్ ఎంజాయ్ చేసే అసలైన విధానం ఇదే అంటున్నారు బ్యూటిఫుల్ హీరోయిన్.
ప్రకృతి ఒడిలో న్యూ ఇయర్ లో అడుగుపెట్టిన అలియా, రణబీర్ కపూర్ ( Ranbir Kapoor) కుటుంబంతో కలిసి హ్యాపీగా రణథంబోర్ నేషనల్ పార్క్ లో (Ranthambore National park) ఎంజాయ్ చేసి రీచార్జ్ అయి వచ్చారు. ఇన్స్టాగ్రాంలో తన న్యూ ఇయర్ ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ షేర్ చేసి బోలెడు లైకులు సంపాదించుకున్న అలియా, తన వింటర్ ఫ్యాషన్ లుక్ తో నిజమైన ఫ్యాషనిస్టా అనిపించుకున్నారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ దీపికా పదుకున్ బర్త్ డే పార్టీకి రణబీర్ తో కలిసి వెళ్లిన అలియా అక్కడ కూడా బాగానే సందడి చేశారు.
క్రేజీ స్టార్ అలియా భట్ టిప్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. ఒకప్పుడు స్థూలకాయంతో బాధపడ్డ అలియా చాలా హెల్తీగా, నాజూగ్గా తయారయ్యారు కనుక ఆమె చెప్పే టిప్స్ ను అత్యధికులు ఫాలో అవుతారు. కేవలం అలియా ఫాన్సే కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ ఫ్యాన్స్, ఫిట్నెస్ ఫ్రీక్స్, ఒబేసిటీతో బాధపడుతూ సన్నబడాలనుకునేవారిపై ఈమె మాటలు బాగా పనిచేస్తున్నాయి కూడా.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.