బిగ్ బాస్ 3 రోజుకో మలుపు తిరుగుతుంది. ఎప్పుడు ఎవరు బయటికి వస్తున్నారో.. ఎవరు లోపలికి వెళ్తున్నారో అర్థం కావడం లేదు. ఎలిమినేట్ అయినా కూడా మళ్లీ ఇంట్లోకి వస్తున్నారు. బిగ్ బాస్ ఈ సారి చేస్తున్నన్ని నాటకాలు మాత్రం ఇదివరకు ఎప్పుడూ చేయలేదు. ముఖ్యంగా ఇప్పటికే ఈ సీజన్లో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. తమన్నా సింహాద్రి ఒకే వారంలో ఎలిమినేట్ అయిపోతే.. శిల్పా చక్రవర్తికి కూడా ఇదే గతి పట్టింది. ఇక ఇప్పుడు అలీ రెజా కూడా మరోసారి ఇంట్లోకి వచ్చాడు.

అలీరెజా, శ్రీముఖి
చాలా రోజుల నుంచి ఈయన రీ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నా కూడా మరికొన్ని రోజుల్లో షో అయిపోతుంది కదా.. ఇప్పుడెందుకు వస్తాడని ప్రచారం జరిగింది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అలీ రెజా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ అని కాకుండా వైల్డ్ కార్డ్ అని చెప్పాడు బిగ్ బాస్. మూడు వారాల కింద అలీ ఎలిమినేట్ అయ్యాడు. అతడి ఎలిమినేషన్ కూడా సంచలనమే.

అలీ రెజా (File)
అసలు అలీ బయటికి వస్తాడని ఎవరూ ఊహించలేదు. అలీ తర్వాత శిల్పా చక్రవర్తి, హిమజ ఎలిమినేట్ అయ్యారు. మళ్లీ అలీ రాకతో శ్రీముఖి అయితే గాల్లో తేలిపోయింది. ఏకంగా వచ్చిన వెంటనే అతన్ని పట్టుకుని నలిపేసింది. ఇక శివజ్యోతి కూడా అలీని పట్టుకుని ఏడ్చేసింది. మొత్తానికి అలీ రాకతో ఇంట్లో మళ్లీ గ్రూపులు ఫామ్ అయిపోతున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:September 26, 2019, 22:45 IST