HOME »NEWS »MOVIE »ali reza shocks after came out from bigg boss house ms

Bigg Boss 3 : అలీ రెజా ఇంట్లో విషాదం.. హౌజ్ నుంచి రాగానే బిగ్ షాక్

Bigg Boss 3 : అలీ రెజా ఇంట్లో విషాదం.. హౌజ్ నుంచి రాగానే బిగ్ షాక్
అలీ రెజా(File Photo)

Bigg Boss Ali Reza : మామయ్య చనిపోయిన విషయాన్ని అమ్మ-నాన్న తనకు చెప్పలేదని.. ఒకవేళ చెబితే అది బిగ్ బాస్ హౌజ్‌లో తనపై ప్రభావం చూపిస్తుందని వారు భావించారని అలీ చెప్పారు. తన కెరీర్‌కు బిగ్ బాస్ ఎంత ముఖ్యమో వారికి తెలుసు కాబట్టే.. అంతటి విషాదాన్ని కూడా తనతో షేర్ చేసుకోలేదని అన్నారు.

  • Share this:
    బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ అలీ రెజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అలీ హౌజ్ నుంచి బయటకు రాగానే ఆయనకు షాకింగ్ విషయం తెలిసింది. తాను హౌజ్‌లో ఉన్న సమయంలో తన మామయ్య చనిపోయాడని తెలియడంతో అలీ రెజా తీవ్ర ఆవేదన చెందాడు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు. జీవితంలో తాను ఉన్నత స్థానానికి చేరుకోవాలని మామయ్య ఎప్పుడూ కోరుకునేవారని అలీ చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు తనకంటూ ఓ పేరు, అందరి నుంచి ప్రశంసలు అందుతున్నవేళ.. ఇవన్నీ చూడటానికి ఆయన లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

    మామయ్య చనిపోయిన విషయాన్ని అమ్మ-నాన్న తనకు చెప్పలేదని.. ఒకవేళ చెబితే అది బిగ్ బాస్ హౌజ్‌లో తనపై ప్రభావం చూపిస్తుందని వారు భావించారని అలీ చెప్పారు. తన కెరీర్‌కు బిగ్ బాస్ ఎంత ముఖ్యమో వారికి తెలుసు కాబట్టే.. అంతటి విషాదాన్ని కూడా తనతో షేర్ చేసుకోలేదని అన్నారు. హౌజ్ నుంచి రాగానే మామయ్య లేరన్న విషయం తెలిసి షాక్ తిన్నానని చెప్పారు.మామయ్య మృతితో ఇంట్లోవాళ్లంతా తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి బయటపడి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు ఇంతమంది తనపై చూపిస్తున్న ప్రేమను ఆస్వాదించాక.. ఇక జీవితంలో ఇంకేమీ అక్కర్లేదనిపిస్తోందని అన్నారు.చివరగా, 'మామా నువ్వు బెస్ట్.. నీ చివరి చూపుకు నోచుకోలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.' అంటూ అలీ రెజా తన ఆవేదనను వ్యక్తపరిచారు.



    View this post on Instagram

    You wanted to see me successful in life and now that i have so many people loving me and praising me ur not there to see that. I wish i could atleast see you for the last time. Mom dad could not send any information cause they knew how important Bigg boss was for me and they dint wanted this to effect my game but they dint know you were equally important for me in life . By the time I could come out of my elimination shock i got another huge shock of you being No more. There has been so much of greef at home and still everyone trying to stay happy and support me . I want nothing more in life after seeing all the love and support from all over . Mama you were the best, Your the best and will always remain the best. Ill always have the regret of not getting to see u for the last time. Love you forever. May your soul rest in peace.

    A post shared by Ali Reza (@i.ali.reza) on


    Published by:Srinivas Mittapalli
    First published:September 11, 2019, 09:21 IST

    टॉप स्टोरीज