Aladdin Movie Review:అల్లాద్దీన్ మూవీ రివ్యూ.. పిల్లలను అబ్బుర పరిచే అద్భుత దీపం..

అలాద్దీన్ గురించి, అత‌ని అద్భుత దీపం గురించి మన తాత ముత్తాతలు కాలం ఉన్న‌ప్ప‌టి నుంచీ అంద‌రూ ర‌క‌ర‌కాల క‌థ‌లు వినే ఉంటారు. అరేబియన్ నైట్స్ కథల్లో అల్లాద్దీన్ అద్భుతదీపం కథ ఉంది. ఇప్పటికే  ఎన్నో భారతీయ భాషల్లో అల్లాద్దీన్ అద్బుతదీపంపై ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. తాజాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

news18-telugu
Updated: May 25, 2019, 11:24 AM IST
Aladdin Movie Review:అల్లాద్దీన్ మూవీ రివ్యూ.. పిల్లలను అబ్బుర పరిచే అద్భుత దీపం..
అల్లాద్దీన్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ రివ్యూ
  • Share this:
చిత్రం: అలాద్దీన్‌
ద‌ర్శ‌క‌త్వం: గ‌య్ రిచీ

నిర్మాత‌: డేన్ లిన్‌, జొనాథ‌న్ ఎరిడ్‌,
న‌టీన‌టులు: విల్ స్మిత్‌, మెనా మ‌సౌద్‌, న‌యోమీ స్కాట్‌, మార్వ‌న్ కెన్జారీ, న‌వీద్ నెగ‌బ‌న్‌, న‌సిమ్ త‌దిత‌రులు.
సంగీతం: అలాన్ మెన్‌క‌న్‌
కెమెరా: అలాన్ స్టెవార్ట్
ఎడిటింగ్‌: జేమ్స్ హెర్బెట్‌నిర్మాణం: వాల్ట్ డిస్నీ పిక్చ‌ర్స్, రైడ్ బ్యాక్, మార్క్ ప్లాట్ ప్రొడ‌క్ష‌న్స్

స్క్రీన్‌ప్లే: జాన్ అగ‌స్ట్, గ‌య్ రిచీ

విడుద‌ల‌: 24 మే 2019 (తెలుగు వెర్ష‌న్‌)

రేటింగ్‌: 3/5

అలాద్దీన్ గురించి, అత‌ని అద్భుత దీపం గురించి మన తాత ముత్తాతలు కాలం ఉన్న‌ప్ప‌టి నుంచీ అంద‌రూ ర‌క‌ర‌కాల క‌థ‌లు వినే ఉంటారు. అరేబియన్ నైట్స్ కథల్లో అల్లాద్దీన్ అద్భుతదీపం కథ ఉంది. ఇప్పటికే  ఎన్నో భారతీయ భాషల్లో అల్లాద్దీన్ అద్బుతదీపంపై ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అవన్నీ కూడా విజయవంతం అయ్యాయి. తాజాగా అలాద్దీన్ అద్భుత‌దీపం గురించి `అలాద్దీన్‌` పేరుతో ఓ సినిమా వ‌చ్చింది. ఇపుడు తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో అద్భుత‌దీపంలో ఉంటే జీనీ (భూతం) పాత్ర‌కు విక్ట‌రీ వెంక‌టేష్‌, అలాద్దీన్ పాత్ర‌కు వ‌రుణ్ తేజ్ డ‌బ్బింగ్ చెప్పారు. ఈ ఏడాది మొద‌ట్లో వీరిద్ద‌రూ క‌లిసి `ఎఫ్ 2`తో న‌వ్వులు పండించారు. ఈ తాజా చిత్రానికి వీరి వాయిస్ ఎంత ప్ల‌స్ అయింది అనేది ఆస‌క్తిక‌రం.మరి ఆ సినిమా ఎలా ఉందో చూద్దాం..

క‌థ‌

కథ చాలామందికి తెలిసిందే అయినా..మరోసారి ప్రేక్షకుల  కోసం సంక్షిప్తంగా..
అలాద్దీన్ చిన్న‌త‌నంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోతాడు. అనాథ‌గా పెరుగుతాడు. ఆక‌లిద‌ప్పులు తీర్చుకోవ‌డానికి దొంగ‌తనం చేస్తుంటాడు. ఆ క్ర‌మంలో అత‌నికి అబ్బు (కోతి)తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఎంతటి సాహ‌సానికైనా వెన‌కాడ‌ని వ్య‌క్తి అలాద్దీన్‌. ఆ రాజ్యంలో యువ‌రాణి జాస్మిన్‌. ఆమెను సుల్తానా అయి రాజ్యాన్ని పాలించాల‌ని ఉంటుంది. కానీ ఆమె తండ్రి ఆమె కోసం సంబంధాలు చూస్తుంటాడు. అదే స‌మ‌యంలో ఆ రాజ్యానికి చెందిన వ‌జీర్ (మహా మంత్రి) తానే రాజు కావాల‌ని క‌ల‌లు కంటాడు. మ‌రోవైపు అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని గుహ‌లో ఉన్న అలాద్దీన్ దీపం తీసుకొచ్చే ధీరుడి కోసం వెతుకుతుంటాడు. మ‌చ్చ‌లేని ఆ వీరుడుని అలాద్దీన్‌లో పోల్చుకుంటాడు. అలాద్దీన్ కు వ‌జీర్ చెప్పిన ఓ విష‌యం ప‌ట్ల గురి కుద‌ర‌డంతో గుహ‌లోకి వెళ్తాడు. అక్క‌డి నుంచి అలాద్దీన్ దీపాన్ని తెచ్చిన అత‌ని జీవితంలో చోటుచేసుకున్న మార్పులు ఏంటి? అనేది ఆస‌క్తిక‌రం.దీపాన్ని తాక‌గానే బ‌య‌టికి వ‌చ్చిన జీనీని అల్లాద్దీన్ ఏమ‌ని అడిగాడు? అత‌ను కోరిక మూడు కోరిక‌లు ఏంటి? వాటిలో స్వార్థానికి ఉప‌యోగించుకున్న‌వి ఎన్ని? జీనీ త‌న నియమాల‌ను దాటి అల్లాద్దీన్‌కి చేసిన సాయం ఏంటి? అల్లాద్దీన్ త‌న స్వార్థాన్ని వ‌దులుకుని జీనీకి చేసిన సాయం ఏంటి? వ‌జీర్ చివ‌రకు ఏమ‌య్యాడు? రాకుమారికి అల్లాద్దీన్ నిజం చెప్పాడా లేదా? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

విశ్లేషణ..
అల్లాద్దీన్ కాన్సెప్ట్ చిన్న పిల్ల‌ల‌కు న‌చ్చిన కాన్సెప్ట్. మన  కాశీ మజిలీ కథలు లాగే.. అరబ్ దేశాల వాళ్లకు అరేబియన్ నైట్స్ కథలు దాదాపు ఒకే కాన్సెప్ట్‌తో ఉంటాయి. అప్ప‌టి రాజ్యాలు, సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌లు, ఎగిరే మాయా తివాచీ, మాట్లాడే ప‌క్షులు, సాయం చేసే కోతులు, మ‌చ్చిక చేసుకున్న పులులు... ఇవ‌న్నీ చూసేకొద్దీ చూడాల‌నిపించే విష‌యాలు. చిన్న‌పిల్ల‌ల‌ను అమితంగా ఆక‌ట్టుకునే అంశాలు. తాజాగా అల్లాద్దీన్‌లో అవ‌న్నీ మ‌రోసారి మెప్పించాయి. వాటితో పాటు తెలుగువారిని ఆక‌ట్టుకున్న మ‌రో విష‌యం వెంక‌టేశ్ స్వ‌రం. జీనీ పాత్ర‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో స‌ర‌దాగా డ‌బ్బింగ్ చెప్పారు. దానికి తోడు ఆయ‌న పాత్ర‌కు రాసిన డైలాగులు కూడా బావున్నాయి. వ‌రుణ్‌తేజ్ డ‌బ్బింగ్ చెప్పార‌న్న సంగ‌తిని మ‌నం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తేగానీ అర్థంకాదు. న‌టీన‌టులంద‌రూ బాగా చేశారు. గ్రాఫిక్స్ బావున్నాయి. కాక‌పోతే అర్థంప‌ర్థంలేని పాట‌లు ప‌దే ప‌దే వ‌స్తూ విసుగు తెప్పించాయి. వేస‌విలో స‌కుటుంబంగా స‌ర‌దాగా చూసే చిత్రం `అలాద్దీన్‌`.

ప్ల‌స్ పాయింట్లు
- నటీన‌టుల న‌ట‌న‌
- గ్రాఫిక్స్
- వెంక‌టేశ్ చెప్పిన డ‌బ్బింగ్‌
- జీనీ కేర‌క్ట‌ర్‌కు రాసిన డైలాగులు

మైన‌స్ పాయింట్లు
- కొన్ని సంద‌ర్భాల్లో మ‌రీ పేల‌వంగా సాగిన స్క్రీన్‌ప్లే
- వ్య‌ర్థ‌మైన పాట‌లు

చివరి మాట: పిల్ల‌ల కోసం `అలాద్దీన్‌`
First published: May 25, 2019, 11:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading