అలరిస్తోన్న అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో టీజర్..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న అలవైకుంఠపురంలో ఇంతకు ముందే విడుదలైన  పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా టీజర్ విడుదలైంది.

news18-telugu
Updated: December 11, 2019, 4:27 PM IST
అలరిస్తోన్న అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో టీజర్..
Ala Vaikunthapurramuloo Teaser poster Twitter
  • Share this:
Ala Vaikunthapurramuloo Teaser : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న అలవైకుంఠపురంలో ఇంతకు ముందే విడుదలైన  పాటలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానికి చేరాయి. కాగా చాలా రోజులనుండి ఊరిస్తోన్న సినిమా టీజర్‌ వచ్చేసింది. ఈరోజు సాయంత్రం చిత్రబృందం ఈ టీజర్‌ను విడుదలచేసింది. విడుదలైన టీజర్ ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకుల్నీ తెగ అలరిస్తోంది. కాగా ఇంతకు ముందు విడుదలైన పాటలకు విశేషమైన స్పందన లభించింది. వాటిలో  ‘సామజవరగమన..’ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ..యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. బన్నీ ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా కనిపిస్తున్నాడు. ఇక పూజా హెగ్డే బన్నీ పనిచేసే ఆఫీస్ హెడ్ గా అతనికి లేడీ బాస్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో వీరితో పాటు సీనియర్ హీరోయిన్ టబు, హీరో సుశాంత్ లతో పాటు నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలవైకుంఠపురంలో వచ్చే ఏడాది జనవరి 12న విడుదల అవుతోంది.


First published: December 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>