news18-telugu
Updated: January 4, 2020, 5:48 PM IST
అల్లు అర్జున్ సామజవరగమన సాంగ్
2019లో టాప్ ట్రెండింగ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచిన సామజవరగమన పాట మరోసారి వచ్చింది. గతంలో ఆ పాటను మేల్ సింగర్ పాడితే, ఈసారి లేడీ సింగర్ పాడింది. శ్రేయా ఘోషల్ ఆ పాటను పాడింది. ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. గతంలో సామజవరగమన పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. ఈసారి అదే పాటను లేడీ వాయిస్‌తో శ్రేయా ఘోషాల్ చేత పాడించారు.
సామజవరగమన పాట అల వైకుంఠపురములో సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుని వెళ్లింది. ఫస్ట్ ఈ పాట రిలీజ్ అయిన వెంటనే సినిమా మీద హైప్ క్రియేట్ అయింది. ఆ తర్వాత వచ్చిన రాములో రాములా పాటతో ఈ సినిమా రేంజ్ మరో ఎత్తుకు ఎదిగింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు సామజవరగమన పాటను శ్రేయా ఘోషల్తో పాడించి దాన్ని రిలీజ్ చేసింది టీమ్.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 4, 2020, 5:35 PM IST