హోమ్ /వార్తలు /సినిమా /

రాములో రాములా వచ్చేసాడు.. రచ్చ చేసిన అల్లు అర్జున్ అండ్ టీం..

రాములో రాములా వచ్చేసాడు.. రచ్చ చేసిన అల్లు అర్జున్ అండ్ టీం..

అల వైకుంఠపురములో రాములో రాములా సాంగ్ పోస్టర్

అల వైకుంఠపురములో రాములో రాములా సాంగ్ పోస్టర్

నాలుగు రోజులుగా సోషల్ మీడియాతో పాటు యూ ట్యూబ్, టిక్ టాక్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా వినిపిస్తున్న పాట రాములో రాములా.. 20 సెకన్లు కూడా లేని ఈ ట్యూన్ సంచలనాలు రేపింది.

నాలుగు రోజులుగా సోషల్ మీడియాతో పాటు యూ ట్యూబ్, టిక్ టాక్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా వినిపిస్తున్న పాట రాములో రాములా.. 20 సెకన్లు కూడా లేని ఈ ట్యూన్ సంచలనాలు రేపింది. ఇక ఇప్పుడు పుల్ సాంగ్ బయటికి వచ్చేసింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలోని పాట ఇది. పక్కా ఫోక్ బీట్ అండ్ తెలంగాణ స్టైల్లో సాగే ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు. ఇక థమన్ మరోసారి అదిరిపోయే బీట్ ఇచ్చాడు. ఈ పాటను పూర్తిగా ఫోక్ స్టైల్లోనే దించేసాడు థమన్.

' isDesktop="true" id="350902" youtubeid="wFAj0pW6xX0" category="movies">

ఇక ఈ పాట మేకింగ్ వీడియో కూడా విడుదలైందిప్పుడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో బన్నీతో పాటు పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరాం లాంటి వాళ్లు కూడా డాన్సులు చేసారు. వాళ్లు చేస్తే ఓకే కానీ సింగర్స్, మ్యూజికల్ ట్రూప్‌తో కూడా డాన్సులు చేయించాడు థమన్. ముఖ్యంగా శివమణి డ్రమ్స్ అదిరిపోయాయి. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట కూడా సామజవరగమనా మాదిరే ఇన్‌స్టంట్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది. జనవరి 12న అల వైకుంఠపురములో విడుదల కానుంది. మరి రాములో రాములా అంటూ బన్నీ ఎన్ని రికార్డులకు తెరతీస్తాడో చూడాలిక.

First published:

Tags: Ala Vaikunthapuramulo, Ala Vaikunthapurramloo, Allu Arjun, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు