నాన్నకు ప్రేమతో అంటున్న అల్లు అర్జున్.. OMG డాడీ సాంగ్ అదుర్స్..

అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరిపోతున్నాయి. తన వారసులతోనే సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2019, 6:20 PM IST
నాన్నకు ప్రేమతో అంటున్న అల్లు అర్జున్.. OMG డాడీ సాంగ్ అదుర్స్..
అల్లు అర్జున్ ఫైల్ ఫోటో
  • Share this:
అల వైకుంఠపురములో సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కు చేరిపోతున్నాయి. తన వారసులతోనే సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈయన అల వైకుంఠపురములో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ క్లైమాక్స్‌కు వచ్చేసింది. ఇప్పటికే ఇందులో సుశాంత్ లాంటి వాళ్లు తమ పాత్రలు పూర్తి చేసుకుని డబ్బింగ్ కూడా మొదలు పెట్టేసారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మూడో పాట వచ్చేసింది. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే కానుకగా టీజర్ ఇచ్చిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ఫుల్ సాంగ్ విడుదల చేసారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించాయి.

మూడో పాట కూడా ఇదే చేస్తుందని నమ్ముతున్నారు. తెలుగు ర్యాప్ కలిసి ఉన్న ఈ పాటలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఈ పాటలో అందరి ఫోటోలను తమ తండ్రులతో కలిసి చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్. బన్నీ నుంచి అల్లు అరవింద్ వరకు అందరి నాన్నల ఫోటోలు ఇందులో ఉన్నాయి. ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో అల్లు అర్జున్ వారసుడు అయాన్‌తో పాటు కూతురు అర్హలు సందడి చేసారు.. ఇప్పుడు కూడా వాళ్ల ఫోటోలతోనే పాట మొదలైంది. వాళ్లు పాటలో మాత్రం ఉంటారు.. సినిమాలో ఉండరు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం విశేషం. జనవరి 12న రిలీజ్ డేట్ అనుకుంటున్నారు కానీ ఎప్పుడు విడుదలవుతుందో చూడాలిక.

First published: November 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com