‘అల వైకుంఠపురములో’ దసరా పోస్టర్.. ఆడుకుంటున్న అల్లు అర్జున్..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే వెళ్తుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 7, 2019, 4:31 PM IST
‘అల వైకుంఠపురములో’ దసరా పోస్టర్.. ఆడుకుంటున్న అల్లు అర్జున్..
అల వైకుంఠపురంలో పోస్టర్
  • Share this:
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగానే వెళ్తుంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తండ్రి సెంటిమెంట్ ఈ చిత్రంలో హైలైట్ కానుందని తెలుస్తుంది. తనకు బలంగా ఉన్న ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా చూపించబోతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దసరా సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ట్విట్టర్లో అయితే నెంబర్ వన్ ట్రెండింగ్‌గా ఉంది ఈ పోస్టర్. ఇందులో బన్నీ ఇచ్చిన పోజ్ కూడా అదిరిపోయింది.

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దానికితోడు సామజవరగమన పాట అయితే విడుదలైనప్పటి నుంచి ట్రెండింగ్ అవుతూనే ఉంది. యూ ట్యూబ్‌లో రికార్డులను తిరగరాసింది ఈ పాట. ఇప్పుడు విడుదలైన దసరా పోస్టర్ కూడా పిచ్చెక్కిస్తుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Published by: Praveen Kumar Vadla
First published: October 7, 2019, 4:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading