వామ్మో.. త్రివిక్రమ్ మళ్లీ అదే ట్రాక్‌లో వెళుతున్నాడా..

మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ మరోసారి అదే పాత ట్రాక్‌లో వెళుతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.

news18-telugu
Updated: December 5, 2019, 6:59 AM IST
వామ్మో.. త్రివిక్రమ్ మళ్లీ అదే ట్రాక్‌లో వెళుతున్నాడా..
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైల్ ఫోటో
  • Share this:
మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ మరోసారి అదే పాత ట్రాక్‌లో వెళుతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా తర్వాత త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తెరకెక్కుతోన్న మూవీ చిత్రం ‘అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగానే జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగుతున్నాయి. ఇక తమన్ స్వరపరిచిన సామజవరగమన’ సాంగ్ యూట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్‌ తెచ్చుకొని తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా అలనాటి ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఇంటిగుట్టు’ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నట్టు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కథనే మాటల మాంత్రికుడు ఇప్పటి తరానికీ తగ్గట్టు పూర్తిగా మార్చి తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. 

ala vaikunthapurramloo movie story inspired by sr ntr one of the super hit movie here are the details,Allu Arjun Ala Vaikuntapuramuloo inspired by Ntr Inti guttu,allu arjun,ala vaikunthapurramuloo,ala vaikuntapuramuloo,ala vaikuntapuramlo,ala vaikunthapurramuloo songs,allu arjun new movie,allu arjun new song,ala vaikuntapuram lo songs,ala vaikuntapuramlo songs,ramuloo ramulaa allu arjun,ala vaikuntapuram song,allu arjun songs,allu arjun alaa vaikuntapuramlo new song update,ala vaikuntapuram lo song,ala vaikunta puram lo songs,ala vaikuntapuram lo first song,ala vaikunthapuramulo,ala vaikunthapuramulo movie,ala vaikunthapuramulo shooting,allu arjun ala vaikunthapuramulo,ala vaikunthapuramulo dubbing work,ala vaikunthapuramulo sushanth dubbing started,ala vaikunthapuramulo movie shooting,ala vaikunthapuramulo allu arjun pooja hegde,ala vaikunthapuramulo trivikram srinivas,telugu cinema,అల్లు అర్జున్,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ సుశాంత్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో డబ్బింగ్ మొదలు,అల వైకుంఠపురములో
ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా (youtube/Credit)


గతంలో త్రివిక్రమ్.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాను వెంకటేష్ హీరోగా నటించిన ‘వారసుడొచ్చాడు’  సినిమాను కొంచెం మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాడు. ఆ తర్వాత నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ‘అ..ఆ’ సినిమా కూడా యద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా దివంతగత విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మీనా’కు యథాతదంగా దించేసాడు. ఆ తర్వాత విమర్శలు రావడంతో ఆ కథనే సినిమాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. మరి ఇపుడు కూడా ‘అల వైకుంఠపురములో’ చిత్ర  విషయంలో త్రివిక్రమ్ కూడా ఈ సినిమా క్రెడిట్.. అసలైన దర్శక నిర్మాతలకు ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఏమైనా సినిమా ఇండస్ట్రీలో చాలా మటుకు కథలు ఏదో ఒక సినిమా లేదా ఇతిహాసాలు, కాశీ మశిలీ కథలు, చందమామా కథల బేస్ చేసుకొనే తెరకెక్కుతాయి.  కాబట్టి ఈ విషయంలో త్రివిక్రమ్‌ను తప్పు పట్టాల్సిన పని లేదంటున్నారు చాలా మంది.
First published: December 5, 2019, 6:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading