మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి అదే పాత ట్రాక్‌లో వెళుతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా తర్వాత త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న తెరకెక్కుతోన్న మూవీ చిత్రం ‘అల వైకుంఠపురములో. ఈ చిత్ర షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగానే జరుగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగుతున్నాయి. ఇక తమన్ స్వరపరిచిన సామజవరగమన’ సాంగ్ యూట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్ తెచ్చుకొని తెలుగులో సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా అలనాటి ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఇంటిగుట్టు’ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నట్టు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కథనే మాటల మాంత్రికుడు ఇప్పటి తరానికీ తగ్గట్టు పూర్తిగా మార్చి తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమా (youtube/Credit)
గతంలో త్రివిక్రమ్.. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమాను వెంకటేష్ హీరోగా నటించిన ‘వారసుడొచ్చాడు’ సినిమాను కొంచెం మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాడు. ఆ తర్వాత నితిన్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించిన ‘అ..ఆ’ సినిమా కూడా యద్దనపూడి సులోచన రాణి నవల ఆధారంగా దివంతగత విజయ నిర్మల దర్శకత్వంలో తెరకెక్కించిన ‘మీనా’కు యథాతదంగా దించేసాడు. ఆ తర్వాత విమర్శలు రావడంతో ఆ కథనే సినిమాగా చేసినట్టు ఒప్పుకున్నాడు. మరి ఇపుడు కూడా ‘అల వైకుంఠపురములో’ చిత్ర విషయంలో త్రివిక్రమ్ కూడా ఈ సినిమా క్రెడిట్.. అసలైన దర్శక నిర్మాతలకు ఇస్తాడా లేదా అనేది చూడాలి. ఏమైనా సినిమా ఇండస్ట్రీలో చాలా మటుకు కథలు ఏదో ఒక సినిమా లేదా ఇతిహాసాలు, కాశీ మశిలీ కథలు, చందమామా కథల బేస్ చేసుకొనే తెరకెక్కుతాయి. కాబట్టి ఈ విషయంలో త్రివిక్రమ్‌ను తప్పు పట్టాల్సిన పని లేదంటున్నారు చాలా మంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.