• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ALA VAIKUNTHAPURRAMLOO MOVIE RARE RECORD THIS MOVIE STREAM IN BOTH SUN NXT AND NETFLIX DIGITAL PLATFORM TA

అల వైకుంఠపురములో మరో రికార్డు.. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు సాధ్యం కాలేదు..

అల వైకుంఠపురములో మరో రికార్డు.. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు సాధ్యం కాలేదు..

ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా హిందీకి వెళ్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని.. ఎక్కడైనా సినిమా ఆడుతుందనే నమ్మకంతో ఉన్నారు బాలీవుడ్ నిర్మాతలు.

ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది.

  • Share this:
    ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే దక్కించుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాను సన్‌ నెక్ట్స్‌లో నిన్నటి నుంచి ప్రీమియర్ చేస్తామని ప్రకటించినా.. ముందుగా ప్రసారం చేయలేదు. ఆ తర్వాత ఏమైందో ఏమో అర్థరాత్రి ఈ సినిమాను సన్‌ నెక్ట్స్‌ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో పెట్టేసారు. అంతేకాదు ఈ సినిమాను సన్ నెక్ట్స్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌తో పాటు మరో డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ నెటిఫ్లిక్స్‌లో కూడా ప్రదర్శితమవుతోంది. ఈ రకంగా రెండు మేజర్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా ‘అల వైకుంఠపురుములో’ సినిమా రికార్డులకు ఎక్కింది.

    సంక్రాంతి కానుకగా విడుదలైన  ‘అల వైకుంఠపురములో’ సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్టైయ్యాయి. తాజాగా నేటితో ఈ సినిమా థియేట్రికల్ దాదాపు ముగింపుకు వచ్చేసింది. మొత్తానికి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో ‘అల వైకుంఠపురములో’ ఏ మేరకు రచ్చ చేస్తుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: