‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌కు అంతా సిద్ధం.. హీరో ఎవరంటే..

ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

news18-telugu
Updated: June 3, 2020, 2:42 PM IST
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌కు అంతా సిద్ధం.. హీరో ఎవరంటే..
ఈ క్రమంలోనే ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా హిందీకి వెళ్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అని.. ఎక్కడైనా సినిమా ఆడుతుందనే నమ్మకంతో ఉన్నారు బాలీవుడ్ నిర్మాతలు.
  • Share this:
ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్‌గా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా దాదాపు రూ. 150 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు యూబ్యూట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఇప్పటికే అల వైకుంఠపురములో’ యూబ్యూట్‌లో 100 కోట్ల మిలియన్ వ్యూస్ దక్కించుకోని పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. తెలుగులో ఒక మ్యూజిక్ ఆల్బమ్‌కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. అంతేకాదు ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్‌కు తెలుగుతో పాటు దేశ,విదేశాల్లో ఫ్యాన్స్ అయిపోయారు. అంతేకాదు బుట్ట బొమ్మ సాంగ్‌కు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన ఈ చిత్రాన్ని ఇపుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడపోయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం.

ala vaikunthapurramloo movie hindi remake rights sold whopping price ranveer singh will play main lead,Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo hindi remake,Ala Vaikuntapurramuloo avpl hindi remake ranveer singh,Ala Vaikuntapurramuloo avpl allu arjun ranveer singh,Ala Vaikuntapurramuloo avpl salman khan,Ala Vaikuntapurramuloo avpl allu arjun shahid kapoor, digital platform,sun next release date fix,ala vaikunthapurramloo amazon prime,allu arjun Ala Vaikuntapurramuloo,Ala Vaikuntapurramuloo movie 22 days worldwide collections,Ala Vaikuntapurramuloo movie collections,Ala Vaikuntapurramuloo movie 20 days collections,Ala Vaikuntapurramuloo movie worldwide collections,allu arjun Ala Vaikuntapurramuloo movie 150 crore club,Ala Vaikuntapurramuloo movie collections till now,Ala Vaikuntapurramuloo movie allu arjun,allu arjun industry hit,అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో,అల్లు అర్జున్ సినిమా,అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్,తెలుగు సినిమా,అల వైకుంఠపురములో సన్ నెక్ట్స్ రిలీజ్ డేట్,సల్మాన్ ఖాన్ అల వైకుంఠపురములో,సల్మాన్ ఖాన్ హిందీ రీమేక్ రైట్స్,షాహిద్ కపూర్ హిందీ రీమేక్‌లో నటించనున్నాడు, అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్, అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్,రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్
అల వైకుంఠపురములో హిందీ రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్ (Twitter/Photo)


ముందుగా ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో సల్మాన్ ఖాన్ పేరు వినిపించింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ లైన్‌లోకి వచ్చాడు. చివరగా అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌‌లో రణ్‌వీర్ సింగ్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఆల్రెడీ ఈయన తెలుగులో హిట్టైన ‘టెంపర్’ సినిమాను హిందీలో ‘సింబా’ గా రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. అందుకే ఇపుడు మరో తెలుగు రీమేక్ పై మనసు పారేసుకున్నాడు. హిందీలో ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి.  మొత్తానికి తెలుగులో సూపర్ హిట్టైన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 3, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading